PUJARA: పుజారా బావమరిది ఆత్మహత్య

PUJARA: పుజారా బావమరిది ఆత్మహత్య
X
తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య

క్రి­కె­ట­ర్ ఛతే­శ్వ­ర్‌ పు­జా­రా ఫ్యా­మి­లీ­లో తీ­వ్ర వి­షా­దం చో­టు­చే­సు­కుం­ది. ఛతే­శ్వ­ర్‌ పు­జా­రా బా­వ­మ­రి­ది జీత్ రసి­క్‌­భా­య్ పబా­రి ఆత్మ­హ­త్య చే­సు­కు­న్నా­రు. ఈ ఘటన రా­జ్‌­కో­ట్‌­లో చో­టు­చే­సు­కుం­ది. పు­జా­రా బా­వ­మ­రి­ది జీత్ రసి­క్‌­భా­య్ పబా­రి గు­జ­రా­త్ రా­జ్‌­కో­ట్‌­లో­ని తన ని­వా­సం­లో ఆత్మ­హ­త్య­కు యత్నిం­చా­రు. అయి­తే ఇం­దు­కు సం­బం­ధిం­చిన సమా­చా­రం అం­దు­కు­న్న స్థా­నిక మా­ల్వి­యా నగర్ పో­లీ­సు­లు వెం­ట­నే అక్క­డి­కి చే­రు­కు­న్నా­రు. జీత్ పబా­రి­ని సమీ­పం­లో­ని ఓ ప్రై­వే­ట్ ఆస్ప­త్రి­కి తర­లిం­చా­రు. అయి­తే అప్ప­టి­కే జీత్ పబా­రి మర­ణిం­చి­న­ట్టు­గా వై­ద్యు­లు ధ్రు­వీ­క­రిం­చా­రు. ఈ క్ర­మం­లో­నే జీత్ పబా­రి మృ­త­దే­హా­న్ని పో­స్ట్‌­మా­ర్టం పరీ­క్షల కోసం పం­పా­రు. అయి­తే జీత్ పబా­రి ఆత్మ­హ­త్య­కు గల కా­ర­ణా­ల­పై పో­లీ­సు­లు దర్యా­ప్తు చే­స్తు­న్నా­రు.

చతే­శ్వ­ర్ పు­జా­రా భా­ర్య పూజ సో­ద­రు­డే జీత్ పబా­రి. చతే­శ్వ­ర్ పు­జా­రా 2013 ఫి­బ్ర­వ­రి­లో పూజా పబా­రి­ని వి­వా­హం చే­సు­కు­న్నా­రు. చతే­శ్వ­ర్ పు­జా­రా అత్త­మా­మ­లు జాం­జో­ధ్‌­పూ­ర్‌­కు చెం­ది­న­వా­రు... కానీ గత ఇరవై సం­వ­త్స­రా­లు­గా రా­జ్‌­కో­ట్‌­లో ని­వ­సి­స్తు­న్నా­రు. అతని అత్త­మా­మ­లు కా­ట­న్ జి­న్నిం­గ్ ఫ్యా­క్ట­రీ­ని నడు­పు­తు­న్నా­రు. జీత్ పబా­రి­కి గతం­లో ఒక మహి­ళ­తో ని­శ్చి­తా­ర్థం జరి­గిం­ది. ఆ తర్వాత ని­శ్చి­తా­ర్థం రద్దైం­ది. ఈ క్ర­మం­లో­నే ఆ మహిళ... జీత్ పబా­రి­పై పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­రు. ఆ ఫి­ర్యా­దు­లో జీత్ పబా­రి­పై సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. జీత్ పబా­రి పె­ళ్లి చే­సు­కుం­టా­న­ని హామీ ఇచ్చి తనతో బల­వం­తం­గా శా­రీ­రక సం­బం­ధం పె­ట్టు­కు­న్నా­డ­ని ఆమె ఆరో­పిం­చా­రు. ఇందుకు సంబంధించి జీత్ పబారిపై గతేడాది నవంబర్‌లో మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసు నుంచి కొనసాగుతున్న ఒత్తిడి అతని మానసిక స్థితిని ప్రభావితం చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Next Story