Mumbai vs Punjab : పంజాబ్ భారీ స్కోర్.. ముంబై ముందు భారీ లక్ష్యం..

X
By - TV5 Digital Team |13 April 2022 9:45 PM IST
Mumbai vs Punjab : ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), మయాంక్ అగర్వాల్ (52) అర్ధ సెంచరీలతో జట్టుకి మంచి ఓపెనింగ్ ఇచ్చారు.
Mumbai vs Punjab : ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), మయాంక్ అగర్వాల్ (52) అర్ధ సెంచరీలతో జట్టుకి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. తొమ్మిదో ఓవర్ వరకు ముంబై ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. చివర్లో జితేష్ శర్మ (30) పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ భారీ స్కోర్ చేయగలిగింది. . పంజాబ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో (12), లియామ్ లివింగ్‌స్టోన్ (2), విఫలమయ్యారు. ఇక ముంబై తరఫున బాసిల్ థంపి రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com