PV Sindhu: జపాన్ ఓపెన్‌లో ఇంటి ముఖం పట్టిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూనే ఉంది. కెనడా ఓపెన్, జపాన్ ఓపెన్, కొరియా ఓపెన్లలో విఫలమైన సింధు ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. అమెరికా క్రీడాకారిణి బీవెన్ ఝాంగ్ చేతిలో 12-21, 17-21 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ నంబర్ 17వ ర్యాంకర్ అయిన పీవీ సింధు కేవలం 39 నిమిషాల్లోనే పరాజయం పాలైంది.
మ్యాచ్ ఆరంభం నుంచీ అమెరికా క్రీడాకారిణి ఆధిపత్యం కొనసాగించింది. మొదటి రౌండ్‌లో తొందరగానే తలొగ్గిన సింధు, 2వ సెట్‌లో కొద్దిగా పోరాడింది. అయినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో తప్పిదాలు చేయడంతో సెట్‌తో పాటుగా మ్యాచ్‌నూ కోల్పోయింది. వరల్డ్ 12 ర్యాంకర్ అయిన బీవెన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ టోర్నీలో తనకంటే తక్కువ ర్యాంకు క్రీడాకారిణుల చేతుల్లో గెలిచి క్వార్టర్స్‌లో చేరింది. అయితే ఆగస్ట్ 21 నుంచి కోపెన్‌హాగన్‌లో జరగనున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఫామ్ భారత్‌ను కలవరపెడుతోంది.
ఈ సంవత్సరం సింధు తాను ఆడిన టోర్నీల్లో 7 టోర్నీల్లో మొదటి రౌండ్లలోనే ఇంటిముఖం పట్టింది. అలాగే కోచ్ పార్క్ టే సాంగ్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మలేషియాకు చెందిన ముహ్మద్ హఫీజ్ హషీంని నూతన కోచ్‌గా నియమించుకుంది. 2024 ఒలంపిక్స్ వరకు కొనసాగనునన్నాడు.
ఆల్-ఇండియన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో కిదాంబి శ్రీకాంత్ అప్ కమింగ్ స్టార్ ప్రియాంషు రజావత్‌తో తలపడనున్నాడు. మరోవైపు, పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్‌లో స్థానం కోసం 6వ సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ టాప్ సీడ్ ఆంథోనీ గింటింగ్‌తో తలపడనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com