PV Sindhu: పీవీ సింధుకూ ఆ టార్చర్ తప్పలేదా..?

PV Sindhu (tv5news.in)
PV Sindhu: మామూలుగా లైమ్‌లైట్‌లో ఉండేవారు ఎవ్వరైనా ఎంతోకొంత ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సిందే. వారు స్పోర్ట్స్ పర్సన్ అయినా, సినీ సెలబ్రిటీ అయినా.. జీవితంలో ఏదో ఒక సమయంలో ట్రోలింగ్‌ను, నెగిటివ్ కామెంట్స్‌ను దాటి వెళ్లాల్సిందే. కానీ అందులో కొంతమంది వీటి గురించి బయటపెడతారు.. కొందరు బయటపెట్టలేరు. పీవీ సింధు కూడా తాను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి ఇన్నాళ్లకు బయటపెట్టింది.
షట్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న పీవీ సింధు కూడా అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్‌ను కూడా ఎదుర్కుందట. దీనిపై తాను ఎక్కువగా బయటపెట్టలేదు. తాజాగా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రామ్‌లో సింధు పాల్గొంది. గతంలో తాను చాలా సందర్భాల్లో ట్రోలింగ్‌కు, సైబర్ బుల్లియింగ్‌కు గురయ్యానని ఆమె వెల్లడించింది. అలాంటి టార్చర్ తాను కూడా అనుభవించానని బయటపెట్టింది.
ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ ఓపెన్‌గా ట్రోల్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీటిని సింధు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని, మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి సందర్భాల్లో అధైర్యపడకుండా పోలీసుల సహకారంతో సైబర్ అటాక్‌లను ఆపాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ క్లాసుల సమయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలను గమనిస్తూ ఉండాలని, ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వాటిని అధిగమించేందుకు చైతన్యం వారిలో నింపాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com