PV SINDHU: క్వార్టర్ ఫైనల్లో ఓడిన పీవీ సింధు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. అద్భుత విజయాలతో క్వార్టర్స్ చేరిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలై పతకాన్ని చేజార్చుకుంది. సింధు క్వార్టర్ ఫైనల్లో పుత్రి వార్దానీ చేతిలో 14-21, 21-13, 16-21 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో సింధు ఆమె ఆరో పతకాన్ని కోల్పోయింది. గత మ్యాచులో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్ వాంగ్ యును చిత్తు చేసింది. ‘‘నేను నిరూపించుకోవడానికి పెద్దగా ఏమీలేదు. నా సత్తా ఏంటో ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నిరూపించా. ప్రత్యేకంగా ఎవరి కోసమో ఆడాల్సిన అవసరం లేదు. విజేతగా నిలవడంపైనే దృష్టిపెట్టా. అయితే, గత రెండేళ్ల నుంచి నా ఆరంభం గొప్పగా లేదు. కెరీర్లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. గాయపడటం కూడా ఇబ్బందిగా మారింది. గెలవాలని తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిసారించి మళ్లీ నూతన ఉత్సాహంతో అడుగు పెట్టా. కేవలం ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం చాలా కష్టపడ్డా. ప్రతి టోర్నీ ముగిసిన తర్వాత.. నేను చేసిన పొరపాట్లు ఏంటో కోచ్‌తో కలిసి చర్చిస్తుంటా. మరోసారి తప్పిదం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు ఈ టోర్నీలో దాని ఫలితం కనిపిస్తోంది’’ అని సింధు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com