PV Sindhu: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్న సింధు.. కేవలం 24 నిమిషాల్లోనే..

PV Sindhu (tv5news.in)
PV Sindhu: కెరీర్ సాఫీగా సాగాలంటే కేవలం చదువుతోనే కాదని, ఇంకా చాలా చేయవచ్చని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. అందులో ఒకరు పీవీ సింధు. ఆటల్లో కెరీర్ ఏర్పరుచుకోవాలి అనుకునే చాలామంది అమ్మాయిలకు స్ఫూర్తి ఆమె. తన ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒలింపిక్స్ వరకూ చేరుకున్న సింధు ఇప్పుడు మరోసారి తన ఆటతో ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం స్పెయిన్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. ఇందులో పీవీ సింధు మూడవ రౌండుకు చేరుకుంది. రెండో రౌండ్‌లో స్లావేకియాకు చెందిన తన ప్రత్యర్థి మార్టిన్ రెపిస్కాను 21-7, 21-9 తేడాతో ఓడించిన సింధు.. కేవలం 24 నిమిషాల్లోనే ఆట ముగించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. దీంతో ఈ చాంపియన్‌షిప్‌లో సింధునే గెలుస్తుంది అన్న నమ్మకం బలంగా ఏర్పడింది.
సింధుతో పాటు శ్రీకాంత్, లక్ష్యసేన్ కూడా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను 22-20, 15-21, 21-18 తేడాతో ఓడించిన లక్ష్యసేన్ మూడో రౌండ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక మెన్స్ డబుల్స్‌లో తాయిపే లీ, యాంగ్‌ను 27-25 21-17 ఓడించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌లు కూడా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com