PV Sindhu : కామన్వెల్త్‌లో 'సింధు' స్వర్ణం..

PV Sindhu : కామన్వెల్త్ గేమ్స్ లో పీవీ సింధు సత్తా చాటింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీని చిత్తుగా ఓడించింది. మిచెల్లిపై 21-15, 21-13 పాయిట్లతో చెలరేగి ఆడింది. సింగిల్స్ లో తొలిసారిగా పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించింది. 2014లో కాంస్యం, 2018లో రజతం సాధించిన సింధు ఇప్పడు ఏకంగా పసిడి పతకం గెలుచుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ లో పీవీ సింధు గోల్డ్ సొంతం చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్‌లో పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్‌గా నిలవడం ఇదే తొలిసారి. పివి సింధు రెండవ గేమ్ ప్రారంభంలో మిచెల్లి కంటే 1 పాయింట్ వెనుకబడి ఉంది.. అయితే ఆమె మరుసటి నిమిషంలో బలమైన పునరాగమనం చేసి బలమైన ఆధిక్యాన్ని సాధించింది.
కెనడా షట్లర్ లీపై పీవీ సింధు వరుస గేమ్‌లలో విజయం సాధించింది. తొలి గేమ్‌ను 21-15తో గెలుచుకోగా, రెండో గేమ్‌లో 21-13తో విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com