Wimbledon 2025: వింబుల్డన్‌లో సంచలనం

Wimbledon 2025: వింబుల్డన్‌లో సంచలనం
X

విం­బు­ల్డ­న్‌­లో ఆరో రోజు కూడా సం­చ­నాల పర్వం కొ­న­సా­గిం­ది. మహి­ళల సిం­గి­ల్స్‌­లో ని­రు­డు ఛాం­పి­య­న్‌­గా ని­లి­చిన బర్బొ­రా క్రె­జి­కో­వా అనూ­హ్యం­గా మూడో రౌం­డ్‌­లో­నే ఇం­టి­దా­రి పట్టిం­ది. పదో సీడ్ ఎమ్మా నవ­ర్రో(అమె­రి­కా) చే­తి­లో పరా­జ­యం­తో టో­ర్నీ నుం­చి ని­ష్క్ర­మిం­చిం­ది. పు­రు­షుల సిం­గి­ల్స్‌­లో టాప్ సీడ్ జన్ని­క్ సి­న్న­ర్ సు­నా­య­సం­గా నా­లు­గో రౌం­డ్‌­లో అడు­గు­పె­ట్టా­డు. ఎమ్మా ధా­టి­కి డి­ఫెం­డిం­గ్ ఛాం­పి­య­న్ ని­లు­వ­లే­క­పో­యిం­ది. తొలి సె­ట్‌­ను కో­ల్పో­యిన అమె­రి­కా స్టా­ర్ ఆ తర్వాత పుం­జు­కొ­ని క్రె­జి­కో­వా­కు షా­కి­స్తూ 2-6, 6-3, 6-4తో నా­లు­గో రౌం­డ్‌­కు దూ­సు­కె­ళ్లిం­ది. ఇక పు­రు­షుల సిం­గి­ల్స్‌­లో ఇటలీ స్టా­ర్ సి­న్న­ర్ జోరు చూ­పిం­చా­డు. ఏక­ప­క్షం­గా సా­గిన మ్యా­చ్‌­లో పె­డ్రో మా­ర్టి­నె­జ్‌ (స్పె­యి­న్‌)ను 6-1, 6-3, 6-1తో మట్టి­క­రి­పిం­చా­డు. దాం­తో అతడు వరు­స­గా నా­లు­గో ఏడా­ది మూడో రౌం­డ్ దా­టా­డు.

Tags

Next Story