CRICKET: కోహ్లీ స్థానంలో రజత్‌ పటీదార్‌

CRICKET: కోహ్లీ స్థానంలో రజత్‌ పటీదార్‌
సర్ఫరాజ్‌ఖాన్‌, పుజారాకు మొండిచెయ్యి.... భరత్‌ స్థానం కూడా ఖాయం!

వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. జట్టులో విరాట్‌ స్థానం కోసం దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న రజత్ పటీదార్‌ వైపే సెలక్షన్‌ కమిటీ మొగ్గు చూపింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 21వ తేదీన సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా ర‌జ‌త్ ప‌టిదార్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అత‌ను 137.50 స్ట్రయిక్ రేట్‌తో 16 బంతుల్లో 22 ర‌న్స్ స్కోర్ చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌, ఛతేశ్వర్‌ పుజారా, రజత్‌ పటీదార్‌ మధ్య పోటీ నెలకొన్నా... సెలక్షన్‌ కమిటీ రజత్‌ పటీదార్‌ వైపే మొగ్గు చూపింది.


రజత్ పటీదార్ భారత్‌ ఏ తరపున రజత్‌ పటీదార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌పై పటీదార్‌ 151 రన్స్‌ చేసి సత్తా చాటాడు. గత నెలలో జరిగిన సౌతాఫ్రికా పర్యటన ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ కూడా రేసులో ముందున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 45గా ఉంది. చాలా కాలంగా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌పై గత రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. 151, 111 పరుగులతో సత్తా చాటాడు.


ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ను తీసుకుంటారా లేదా స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే తీసుకుంటారా అన్న అనుమానాలకు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టత ఇచ్చారు. ఈ టెస్ట్ సిరీస్‌లో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ప్రకటనతో ఆంధ్ర క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌... రెండు టెస్టుల మ్యాచులో వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రేపటి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. రాహుల్‌ కీపింగ్‌పై స్పష్టత ఇచ్చేశాడు. ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌కు దూరంగా ఉంటాడని... జట్టు ఎంపిక సమయంలోనే దీనిపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని ద్రవిడ్‌ వెల్లడించాడు. రాహుల్‌ కాకుండా మరో ఇద్దరు వికెట్‌ కీపర్లను జట్టుకు ఎంపిక చేశామని... అయిదు టెస్టు మ్యాచ్‌లు ఉండటం.. భారత్‌లో పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని రాహుల్‌ కాకుండా కేఎస్‌ భరత్‌, ధ్రువ్‌ జురెల్‌లను జట్టులోకి తీసుకున్నామని ద్రవిడ్‌ వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story