KOHLI: కోహ్లీనా.. మజాకా..?

దేశవాళీ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ తిరిగివచ్చాడు. 13 ఏళ్ల తరువాత కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. రైల్వేపై జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం 36 ఏళ్ల స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ప్రేక్షకులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీలో కోహ్లీ బరిలోకి దిగుతున్నాడంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే జరిగింది. అభివన క్రికెట్ దేవుడ్ని చూసేందుకు మైదానానికి అశేష స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. .దాదాపు 10వేల మందికి పైగా వస్తారని భావించి ఏర్పాట్లు చేయగా.. అంతకు మించి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
మైదానం బయట తోపులాట
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా ఏళ్ల తర్వాత రంజీ మ్యాచులో బరిలోకి దిగాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా రైల్వేస్‌తో ఢిల్లీ తలపడుతోంది. ఈ మ్యాచులో కోహ్లీని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 10వేల మంది వస్తారని అంచనా వేస్తే అంతకంటే ఎక్కువ మంది తరలి వచ్చారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. కొందరు కింద పడిపోయారు. పోలీస్ బైక్ ధ్వంసమవ్వగా.. ముగ్గురు గాయపడ్డారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ జట్టు తరఫున రంజీ మ్యాచ్ బరిలోకి దిగారు. దీంతో ఆయన్ని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈక్రమంలో అరుణ్ జైట్లీ మైదానం వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ-రైల్వేస్ మ్యాచ్ కొనసాగుతోంది.
కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని!
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి.. విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కాడు. ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. 'ఏంటి.. ఒక మనిషిని ఇంతలా ఆరాధిస్తారా' అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు కోహ్లీ వీక్‌నెస్ అదే: కైఫ్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కోహ్లీ 2012లో చివరిగా రంజీ మ్యాచ్ ఆడాడు. అప్పటికి అతడేమీ స్టార్ కాదు. అప్పుడు కూడా అతడికి ఆఫ్‌సైడ్ బంతి వీక్‌నెస్ ఉంది. కానీ, అతడు తన వీక్‌నెస్‌ను జయించి అంతర్జాతీయ క్రికెట్‌లో భారీగా రన్స్ చేయడం అద్భుతమే. వన్డేల్లో 50 శతకాలు చేశాడు. టెస్టుల్లో ఇటీవల మినహా అంతకుముందు టాప్ బ్యాటర్‌గా నిలిచాడు’ అని తెలిపారు.Ranji Trophy Highlights, Delhi vs Railways: Delhi bowl Railways out for 241, Kohli-crazy crowd in Delhi made to wait
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com