RANJI TROPHY: రంజీ ట్రోఫీ.. ముంబై జట్టు ప్రకటన

RANJI TROPHY: రంజీ ట్రోఫీ.. ముంబై జట్టు ప్రకటన
X
జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్

రంజీ ట్రో­ఫీ 2025-26 సీ­జ­‌­న్‌­లో భా­గం­గా జ‌­మ్మూ కా­శ్మీ­ర్‌­తో జ‌­రి­గే తొలి మ్యా­చ్ కోసం ముం­బై క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్ త‌మ జ‌­ట్టు­ను ప్ర­క­‌­టిం­చిం­ది. ఈ జ‌­ట్టు­కు కె­ప్టె­న్‌­గా స్టా­ర్ ఆల్‌­రౌం­డ­‌­ర్ శా­ర్ధూ­ల్ ఠా­కూ­ర్ ఎం­పి­క­య్యా­డు. గాయం కా­ర­‌­ణం­గా బు­చ్చి­బా­బు ఇన్వి­టే­ష­న­ల్ టో­ర్న­మెం­ట్‌­కు దూ­ర­‌­మైన స్టా­ర్ ప్లే­య­‌­ర్ సర్ఫ­రా­జ్ ఖాన్ తి­రి­గి జట్టు­లో­కి వ‌­చ్చా­డు. బీ­సీ­సీఐ నుం­చి ఫి­ట్‌­నె­స్ క్లి­య­‌­రె­న్స్ రా­వ­‌­డం­తో స‌­ర్ఫ­రా­జ్‌­ను సె­ల­‌­క్ట­ర్లు ఎం­పిక చే­శా­రు. అయి­తే టీ­మిం­డి­యా టీ20 కె­ప్టె­న్‌, ముం­బై­క­‌­ర్ సూ­ర్య­‌­కు­మా­ర్ యా­ద­‌­వ్ మా­త్రం ఆస్ట్రే­లి­యా ప‌­ర్య­ట­‌­న­‌­కు వె­ళ్ల­నుం­డ­‌­డం­తో జ‌­మ్మూ­తో మ్యా­చ్‌­కు దూ­ర­‌­మ­‌­య్యా­డు. ప్రా­క్టీ­స్ గే­మ్‌­లో పా­ల్గొ­న్న చాలా మంది ఆట­గా­ళ్లు ఈ 16 మంది సభ్యుల జట్టు­లో ఉన్నా­రు.

ముషీర్‌కు పృథ్వీ షా క్షమాపణలు

ముం­బై, మహా­రా­ష్ట్ర రంజీ ట్రో­ఫీ వా­ర్మా­ప్ మ్యా­చ్‌­లో ము­షీ­ర్ ఖా­న్‌-పృ­థ్వీ షా మధ్య చోటు చే­సు­కు­న్న వి­వా­దం ము­గి­సి­పో­యిం­ది. ము­షీ­ర్‌­కు పృ­థ్వీ క్ష­మా­ప­ణ­లు చె­ప్పి­న­ట్లు సమా­చా­రం. "పృ­థ్వీ షా తన తప్పు­ను తె­లు­సు­కు­ని ము­షీ­ర్‌­కు క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­డు. పృ­థ్వీ అత­డి­తో­తో నేను నీకు అన్న­య్య లాం­టి­వా­డి­ని అని చె­ప్పు­కొ­చ్చా­డు. ప్ర­స్తు­తం ఇద్ద­రి మధ్య ఎటు­వం­టి వి­బే­ధా­లు లేవు. అంతా బా­గా­నే ఉంది" మహా­రా­ష్ట్ర క్రి­కె­ట్ అసో­యే­షి­న్ వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. రంజీ ట్రో­ఫీ 2025-26 సీ­జ­‌­న్‌­కు ముం­దు ముం­బై, మ‌­హా­రా­ష్ట్ర జ‌­ట్లు ప్రా­క్టీ­స్ మ్యా­చ్‌­లో త‌­ల­‌­ప­‌­డ్డా­యి. ఈ మ్యా­చ్‌­లో మ‌­హా­రా­ష్ట్ర త‌­ర­‌­పున ఆడిన పృ­థ్వీ షా(181) భారీ సెం­చ­‌­రీ­తో చె­ల­‌­రే­గా­డు. తొలి రోజు ఆట ము­గి­స్తుం­ద­న్న సమ­యం­లో పృ­థ్వీ.. ము­షీ­ర్ ఖాన్ బౌ­లిం­గ్‌­లో భారీ షా­ట్‌­కు ప్ర­య­త్నిం­చా­డు. ము­షీ­ర్ వి­కె­ట్ తీ­సిన తర్వాత "థాం­క్యూ" అని కా­స్త వ్యం­గ్యం­గా అన్నా­డు. దీం­తో పృ­థ్వీ షా కో­పం­తో ఊగి­పో­యా­డు. ము­షీ­ర్‌­ను బ్యా­ట్‌­తో కొ­ట్టేం­దు­కు అతడు వె­ళ్లా­డు. అం­పై­ర్‌­లు, సహచర ఆట­గా­ళ్లు జో­క్యం చే­సు­కో­వ­డం­తో గొడవ సద్దు­మ­ణి­గిం­ది. ఈ వ్య­వ­హ­రం­పై ముం­బై, మహా­రా­ష్ట్ర సీ­రి­య­స్ అయ్యా­యి. వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చా­యి. అం­త­లో­నే ము­షీ­ర్‌­కు పృ­థ్వీ సారీ వి­వా­దా­న్ని ము­గిం­చా­డు.

సన్‌రైజర్స్‌ యాజమాన్యంతో గొడవ.. దిగ్గజం అవుట్

మాజీ ఇం­గ్లం­డ్‌ ప్లే­య­ర్‌ ఆం­డ్రూ ఫ్లిం­టా­ఫ్‌ సన్‌­రై­జ­ర్స్‌ హై­ద­రా­బా­ద్‌ (ఐపీ­ఎ­ల్‌) సి­స్ట­ర్‌ ఫ్రాం­చై­జీ అయిన నా­ర్త్ర­న్‌ సూ­ప­ర్‌ ఛా­ర్జ­ర్స్‌­తో బం­ధా­న్ని తెం­చు­కు­న్నా­డు. గత రెం­డు సీ­జ­న్లు­గా సూ­ప­ర్‌ ఛా­ర్జ­ర్స్‌ హె­డ్‌ కో­చ్‌­గా వ్య­వ­హ­రి­స్తు­న్న ఫ్లిం­టా­ఫ్‌.. యా­జ­మా­న్యం­తో వి­భే­దాల కా­ర­ణం­గా పదవి నుం­చి వై­దొ­లి­గా­డు. సూ­ప­ర్‌ ఛా­ర్జ­ర్స్‌ యా­జ­మా­న్యా­ని­కి ఫ్లిం­టా­ఫ్‌­కు పా­రి­తో­షి­కం వి­ష­యం­లో గొడవ జరి­గి­న­ట్లు తె­లు­స్తుం­ది. సన్‌­రై­జ­ర్స్‌ యా­జ­మా­న్యం సూ­ప­ర్‌ ఛా­ర్జ­ర్స్‌­ను ఓవ­ర్‌­టే­క్‌ చే­శాక ఫ్లిం­టా­ఫ్‌­కు జీతం పెం­చు­తా­మ­ని మాట ఇచ్చా­రట. అయి­తే ఈ పెం­పు నా­మ­మా­త్రం­గా ఉం­డ­టం­తో ఫ్లిం­టా­ఫ్‌ అసం­తృ­ప్తి­గా ఉన్నా­డు. ఈ వి­ష­యా­న్ని యా­జ­మా­న్యం వద్ద ప్ర­స్తా­విం­చి­నా పె­ద్ద­గా పట్టిం­చు­కో­క­పో­వ­డ­డం­తో కో­చ్‌ పద­వి­కి రా­జీ­నా­మా చే­శా­డు. సూ­ప­ర్‌ ఛా­ర్జ­ర్స్‌ ఆఫ­ర్‌ చేసే దా­ని­కం­టే నా సే­వ­ల­కు చాలా వి­లు­వై­న­వ­ని ఫ్రాం­చై­జీ­ని వీ­డాక ఫ్లిం­టా­ఫ్‌ అన్నా­డు. 47 ఏళ్ల ఫ్లిం­టా­ఫ్‌ గత రెం­డు సీ­జ­న్ల­లో నా­ర్త్ర­న్‌ సూ­ప­ర్‌ ఛా­ర్జ­ర్స్‌­కు హె­డ్‌ కో­చ్‌­గా పని చే­శా­డు. ఈ రెం­డు సీ­జ­న్ల­ను ఆ జట్టు నా­లు­గు, మూడు స్థా­నా­ల­తో ము­గిం­చిం­ది.

Tags

Next Story