IPL: వివాదంలో రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2025లో ఎన్నో అంచనాలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆశించినంత స్థాయిలో ఆడట్లేదు. బౌలింగ్ లో అశ్విన్ సగటు 40 ఉండగా, ఎకానమీ రేటు 9కి పైగా ఉంది. దీంతో అతడిపై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ మరో కొత్త వివాదంలోకి చిక్కుకున్నాడు. ఈసీజన్‌లో అశ్విన్ మాత్రమే కాదు మొత్తం సీఎస్కే మొత్తం జట్టు కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓడింది. జట్టులోని కీలక బ్యాటర్లంతా చేతులెత్తేస్తున్నారు. కేవలం ఆ జట్టులోని స్పిన్నర్ నూర్ అహ్మద మాత్రమే రాణిస్తున్నాడు. జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కానీ అశ్విన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ మాత్రం నూర్ అహ్మద్ పై తీవ్ర విమర్శలు చేసి వివాదంలో ఇరుక్కుంది.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ప్రసన్న ఆగోరం
గత వారం ఛానెల్‌లో పోస్ట్ చేసిన అశ్విన్ వీడియోలలో ఒకదానిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ డేటా విశ్లేషకుడు ప్రసన్న అగోరం మాట్లాడుతూ.. సీఎస్‌కే టీమ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ బౌలర్లు ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్‌ను ఆడించడంపై విమర్శలు చేశాడు. ఇటీవలే ఏప్రిల్ 5న దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. అప్పుడు రవించంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో ఒక ప్యానలిస్టు.. నూర్‌పై ఇష్టమొచ్చి మాట్లాడాడు. అసలు అతడిని కొనుగోలు చేయాల్సింది కాదని తీవ్ర పేర్కొన్నాడు. దీంతో రవిచంద్రన్ తో పాటు అతడి ఛానల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అశ్విన్ ఛానల్.. ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ఇకపై చెన్నై మ్యాచ్‌ల కవరేజీకి దూరంగా ఉంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అశ్విన్‌కు ఈ విమర్శలకు సంబంధం లేదని వెల్లడించింది.
వీడియో తొలగింపు
ఆ తర్వాత అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఆ వీడియోను తొలగించారు. ఇప్పుడు తాజాగా సీఎస్‌కే మ్యాచ్‌లకు సంబంధించి ఎలాంటి విశ్లేషలను చేయబోమంటూ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ అడ్మిన్ వెల్లడించాడు. ఐపీఎస్ సీజన్ ముగిసే వరకు సీఎస్‌కే గురించి ఎలాంటి విషయాలు చర్చించడం లేదంటూ పేర్కొన్నారు. ఆల్రెడీ ఆ టీమ్‌లో అశ్విన్ ఆడుతున్నాడు కాబట్టి, ఆ టీమ్‌కు సంబంధించి తన యూట్యూబ్ ఛానెల్‌లో విమర్శలు చేయడం, వాళ్లు స్ట్రాటజీని ప్రశ్నించడం సరికాదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అశ్విన్ ఛానల్.. ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ఇకపై చెన్నై మ్యాచ్‌ల కవరేజీకి దూరంగా ఉంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అశ్విన్‌కు ఈ విమర్శలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో కఠినమైన దశను ఎదుర్కొంటోంది. అద్భుత ఆటగాళ్లతో నిండిన జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com