JADEJA: 600 వికెట్లు.. 6000 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన ఆరో భారత ఆటగాడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నిలిచాడు. నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో జడేజా 9-1-26-3 గణాంకాలతో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు. జడ్డూ 80 టెస్టు మ్యాచుల్లో 323 వికెట్లు, వన్డేల్లో 233 వికెట్లు, 72టీ20 మ్యాచ్‌లో 54 వికెట్లు తీశాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 401 మ్యాచుల్లో 953 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంతుకుముందు కపిల్ దేవ్ (687), హర్భజన్ సింగ్ (711), రవిచంద్రన్ అశ్విన్ (765), అనిల్ కుంబ్లే (956), జహీర్ ఖాన్ (610) ఉన్నారు. జడేజా టెస్టుల్లో 323 వికెట్లు, వన్డేల్లో 224, టీ20ల్లో 54 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 6000 పరుగులు, 600 వికెట్లు తీసిన రెండవ భారతీయ ఆటగాడిగా జడేజా నిలిచాడు. అతని కంటే ముందు కపిల్ దేవ్ ఈ ఘనత సాధించాడు.
జడ్డూ మరో ఘనత
జడేజా మరో ఘనత సాధించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌పై ఇప్పటి వరకు వన్డేల్లో 42 వికెట్లు తీశాడు. రెండు దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో 40 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్‌ను వెనక్కి నెట్టి.. లిస్ట్‌లో అగ్రస్థానానికి చేరాడు. అండర్సన్ 40 వికెట్లతో రెండోస్థానంలో ఉండగా.. 37 వికెట్లతో ఆండ్రూ ప్లింటాఫ్ మూడో ప్లేస్, 36 వికెట్లతో హర్భన్ సింగ్ నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. జడేజా ఇప్పుడు భారత్-ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్‌లలో 41 వికెట్లు పడగొట్టాడు.
అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు
అనిల్ కుంబ్లే 953 వికెట్లు (499 మ్యాచ్‌లు)
రవిచంద్రన్ అశ్విన్ 765 వికెట్లు (369 మ్యాచ్‌లు)
హర్భజన్ సింగ్ 711 వికెట్లు ( 442 మ్యాచ్‌లు)
కపిల్ దేవ్ 687 వికెట్లు ( 448 మ్యాచ్‌లు)
జహీర్ ఖాన్ 610 వికెట్లు ( 373 మ్యాచ్‌లు)
రవీంద్ర జడేజా 600 వికెట్లు ( 397* మ్యాచ్‌లు)
జవగళ్ శ్రీనాథ్ 551 వికెట్లు ( 348 మ్యాచ్‌లు)
మహ్మద్ షమీ 452 వికెట్లు (188* మ్యాచ్‌లు)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com