Ravindra Jadeja : చెన్నైకి షాక్.. ఐపీఎల్‌కి జడేజా దూరం..!
Ravindra Jadeja : డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై జట్టుకి గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు.. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. 'రవీంద్ర జడేజా పక్కటెముకకు గాయమైంది. అందుకే ఆదివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులో లేడు. వైద్యుల సలహా మేరకు అతడు ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడు' అని వెల్లడించాడు.
ఐపీఎల్ 2022 కి గాను చెన్నై జట్టుకి కెప్టెన్ గా జడేజా ఎంపికయ్యాడు... అతడి నాయకత్వంలో చెన్నై జట్టు వరుస పరాజయాలు చవిచూసింది. దీనితో ఆ బాధ్యతలను తిరిగి ధోనికి అప్పగించింది యాజమాన్యం.. కాగా ఈ సీజన్ లో 10 మ్యాచ్‌లు ఆడిన జడేజా 116 పరుగులు మాత్రమే చేయగా, బౌలింగ్‌లోనూ 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే జరగబోయే అన్ని మ్యాచ్ లలో గెలవాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com