RAVISHASTRY: ఓటములకు వంద శాతం బాధ్యత గంభీర్‌దే

టీమిండియా టెస్టుల్లో పతనంపై మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల బాధ్యతను ప్రశ్నిస్తూ, గంభీర్ నాయకత్వంలో జట్టు వైఫల్యాలపై విమర్శకులు మండిపడుతున్న విధానంపై రవిశాస్త్రి స్పందించాడు. తన హయాంలో ఇలా జరిగి ఉంటే పూర్తి బాధ్యత తానే తీసుకుని ఉండేవాడిని అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ద్రవిడ్ తర్వాత గంభీర్ వచ్చాక పరిస్థితి మారిందని నెటిజన్లు అంటున్నారు. వరుస ఓటములతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు కూడా భారత్ కష్టతరం చేసుకుంది. ‘గువాహటి టెస్టులో భారత్ టాప్ ఆర్డర్ విఫలమైంది. అలా అని టీమ్ఇండియా పేలవమైన జట్టు కాదు. మన ఆటగాళ్లు ఎంతో ప్రతిభావంతులు. వారికి స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కొత్త కాదు. చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడుతున్నారు. కాబట్టి, కచ్చితంగా వారు మరింత బాధ్యత తీసుకుని ఆడాలి’ అని రవిశాస్త్రి వివరించాడు. జట్టు పేలవ ప్రదర్శన విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను మీరు రక్షిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘నేను అతడిని కాపాడటం లేదు. 100 శాతం అతను కూడా బాధ్యత తీసుకోవాలి.కానీ, జట్టు సమావేశంలో ఆటగాళ్లను కచ్చితంగా ప్రశ్నించేవాడిని’ అని సమాధానమిచ్చాడు.
టీమిండియా కోచ్‌గా సెహ్వాగ్..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు వరుసగా టెస్ట్ సిరీస్ లు కోల్పోతున్న సంగతి తెలిసిందే. సొంత గడ్డపై గతంలో న్యూజిలాండ్, మొన్న దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు వైట్ వాష్ అయింది. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాల కారణంగా, సొంతగడ్డపై కూడా భారత జట్టు విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఈ అంశంపై ఫైర్ అవుతున్నారు. ఇక చాలా మంది అభిమానులు అయితే, కోచ్ పదవిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ స్థానంలో రవి శాస్త్రీని మరోసారి కోచ్‌గా తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది మహేంద్ర సింగ్ ధోనికి ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. అయితే నేషనల్ మీడియా కథనాల ప్రకారం, టి20 వరల్డ్ కప్ అయిపోయే వరకు గౌతమ్ గంభీర్ కోచ్ గా కొనసాగుతాడట. ఆ తర్వాత అతన్ని తప్పించే ఛాన్స్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదే జరిగితే గౌతమ్ గంభీర్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ కు అవకాశం రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. భారత జట్టుకు గతంలో సుదీర్ఘకాలం పాటు వీరేంద్ర సెహ్వాగ్ సేవలందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

