RCB: చిన్నస్వామికి మళ్లీ పెద్ద సంబరం

RCB: చిన్నస్వామికి మళ్లీ పెద్ద సంబరం
X
చిన్నస్వామిలో మళ్లీ క్రికెట్ సందడి... నెలల తరబడి నెలకొన్న అనిశ్చితికి తెర... కీలక ప్రకటన చేసిన కర్ణాటక క్రికెట్ బోర్డు

నెలల తర­బ­డి కొ­న­సా­గిన అని­శ్చి­తి­కి ఎట్ట­కే­ల­కు తె­ర­ప­డిం­ది. క్రి­కె­ట్ అభి­మా­ను­లు, ము­ఖ్యం­గా రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు అభి­మా­ను­లు ఊపి­రి పీ­ల్చు­కు­నే శు­భ­వా­ర్త ఇది. బెం­గ­ళూ­రు­లో­ని ప్ర­తి­ష్ఠా­త్మక ఎం. చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో మళ్లీ క్రి­కె­ట్ సం­ద­డి మొ­ద­లు­కా­నుం­ది. అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­లు, ఇం­డి­య­న్ ప్రీ­మి­య­ర్ లీగ్ (ఐపీ­ఎ­ల్) పో­టీల ని­ర్వ­హ­ణ­కు కర్ణా­టక ప్ర­భు­త్వం అను­మ­తి మం­జూ­రు చే­సి­న­ట్లు కర్ణా­టక రా­ష్ట్ర క్రి­కె­ట్ సంఘం (కే­ఎ­స్‌­సీఏ) అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చిం­ది. దీం­తో ఆర్సీ­బీ హోం­గ్రౌం­డ్‌­గా పే­రు­గాం­చిన చి­న్న­స్వా­మి స్టే­డి­యం మళ్లీ క్రి­కె­ట్ ఉత్స­వా­ల­కు వే­దిక కా­నుం­ది. ఈ వి­ష­య­మై కే­ఎ­స్‌­సీఏ వి­డు­దల చే­సిన ప్ర­క­ట­న­లో కీలక వి­వ­రా­లు వె­ల్ల­డిం­చిం­ది. “బెం­గ­ళూ­రు­లో­ని చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో అం­త­ర్జా­తీయ, ఐపీ­ఎ­ల్ మ్యా­చ్‌ల ని­ర్వ­హ­ణ­కు కర్ణా­టక ప్ర­భు­త్వం, హోం శాఖ అను­మ­తి మం­జూ­రు చే­సిం­ద­ని తె­లి­య­జే­య­డా­ని­కి మేం సం­తో­షి­స్తు­న్నాం. ప్ర­భు­త్వం ని­య­మిం­చిన టా­స్క్‌­ఫో­ర్స్ ని­వే­ది­క­ను సమ­గ్రం­గా పరి­శీ­లిం­చిన అనం­త­రం భద్ర­తా ఏర్పా­ట్లు సం­తృ­ప్తి­క­రం­గా ఉన్నా­య­ని ని­ర్ధా­రిం­చ­డం­తో ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు” అని స్ప­ష్టం చే­సిం­ది. ఈ ప్ర­క­ట­న­తో స్టే­డి­యం భవి­ష్య­త్తు­పై నె­ల­కొ­న్న సం­దే­హా­ల­కు తె­ర­ప­డి­న­ట్లైం­ది.

గతం­లో చో­టు­చే­సు­కు­న్న వి­షాద ఘటన కా­ర­ణం­గా చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో అన్ని క్రి­కె­ట్ కా­ర్య­క­లా­పా­లు ని­లి­చి­పో­యా­యి. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­లో 18 ఏళ్ల ని­రీ­క్ష­ణ­కు తె­ర­దిం­చు­తూ రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు ఛాం­పి­య­న్‌­గా ని­లి­చిన సం­గ­తి తె­లి­సిం­దే. ఆ చా­రి­త్రక వి­జ­యా­న్ని పు­ర­స్క­రిం­చు­కు­ని గతే­డా­ది జూన్ 4న చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో భా­రీ­గా సం­బ­రా­లు ని­ర్వ­హిం­చా­రు. అయి­తే ఆ ఆనం­దో­త్సా­హం క్ష­ణా­ల్లో­నే వి­షా­దం­గా మా­రిం­ది. స్టే­డి­యం పరి­స­రా­ల్లో జరి­గిన తొ­క్కి­స­లా­ట­లో 11 మంది అభి­మా­ను­లు ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. మరో 50 మం­ది­కి పైగా తీ­వ్రం­గా గా­య­ప­డ్డా­రు. ఈ ఘటన దే­శ­వ్యా­ప్తం­గా సం­చ­ల­నం సృ­ష్టిం­చిం­ది. లక్ష­లా­ది మంది అభి­మా­ను­లు ఒక్క­సా­రి­గా స్టే­డి­యం వైపు తర­లి­రా­వ­డం, సరైన ట్రా­ఫి­క్ ని­యం­త్రణ, జన­సం­చార ని­యం­త్రణ చర్య­లు లే­క­పో­వ­డ­మే ఈ దు­ర్ఘ­ట­న­కు ప్ర­ధాన కా­ర­ణ­మ­ని దర్యా­ప్తు ని­వే­దిక తే­ల్చిం­ది. ఈ ఘటన అనం­త­రం చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో మ్యా­చ్‌ల ని­ర్వ­హ­ణ­పై తీ­వ్ర ప్ర­శ్న­లు తలె­త్తా­యి.

అసలేం జరిగిదంటే...?

ఈ వి­షాద ఘట­న­పై కర్ణా­టక ప్ర­భు­త్వం వెం­ట­నే స్పం­దిం­చిం­ది. వి­శ్రాంత న్యా­య­మూ­ర్తి జస్టి­స్ జాన్ మై­కె­ల్ డి. కు­న్హా నే­తృ­త్వం­లో ఒక న్యాయ వి­చా­రణ కమి­ష­న్‌­ను ఏర్పా­టు చే­సిం­ది. ఈ జ్యు­డి­షి­య­ల్ కమి­ష­న్ స్టే­డి­యం­లో జరి­గిన ఘట­న­కు గల కా­ర­ణా­ల­ను లో­తు­గా పరి­శీ­లిం­చిం­ది. భద్ర­తా లో­పా­లు, జన ని­యం­త్ర­ణ­లో వై­ఫ­ల్యం, ముం­ద­స్తు ప్ర­ణా­ళి­కల కొరత వంటి అం­శా­ల­ను కమి­ష­న్ తన ని­వే­ది­క­లో ప్ర­స్తా­విం­చిం­ది. అం­తే­కా­దు, అప్ప­టి పరి­స్థి­తు­ల్లో చి­న్న­స్వా­మి స్టే­డి­యం పె­ద్ద మ్యా­చ్‌ల ని­ర్వ­హ­ణ­కు పూ­ర్తి­గా సు­ర­క్షి­తం కా­ద­ని కమి­ష­న్ తే­ల్చిం­ది. ఈ ని­వే­దిక నే­ప­థ్యం­లో చి­న్న­స్వా­మి స్టే­డి­యం­లో అన్ని క్రి­కె­ట్ కా­ర్య­క­లా­పా­ల­ను ని­లి­పి­వే­యా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆదే­శా­లు జారీ చే­సిం­ది. దీం­తో అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­లు, ఐపీ­ఎ­ల్ పో­టీ­లు ఇతర వే­ది­క­ల­కు తర­లిం­చా­ల్సి వచ్చిం­ది. ఈ ని­ర్ణ­యం కే­ఎ­స్‌­సీ­ఏ­తో పాటు క్రి­కె­ట్ అభి­మా­ను­ల­కు కూడా ని­రాశ కలి­గిం­చిం­ది. అయి­తే భద్ర­తే ప్ర­ధా­న­మ­న్న ఉద్దే­శం­తో ప్ర­భు­త్వం కఠిన ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. వి­షాద జ్ఞా­ప­కా­ల­ను దా­టు­కు­ని చి­న్న­స్వా­మి స్టే­డి­యం మళ్లీ క్రి­కె­ట్ పం­డు­గ­ల­కు సి­ద్ధ­మ­వు­తోం­ది. గతం­లో జరి­గిన తప్పి­దాల నుం­చి పా­ఠా­లు నే­ర్చు­కు­ని, భద్ర­త­కు ప్రా­ధా­న్యం ఇస్తూ మ్యా­చ్‌­ల­ను ని­ర్వ­హి­స్తా­మ­ని హామీ ఇస్తు­న్నా­రు.

Tags

Next Story