IPL: బెంగళూరు దంచేసింది.. ముంబై చేతులెత్తేసింది

IPL: బెంగళూరు దంచేసింది.. ముంబై చేతులెత్తేసింది
X
ముంబైను ఓడించిన బెంగళూరు... 240 పరుగుల స్కోరు చేసిన ఆర్సీబీ... సాల్ట్, కోహ్లీ, పాటిదార్ అర్ధ శతకాలు

సొంత మై­దా­నం­లో ముం­బై­కు పరా­భ­వం ఎదు­రైం­ది. బెం­గ­ళూ­రు దూ­కు­డు ముం­దు ముం­బై ఇం­డి­య­న్స్‌ తే­లి­పో­యిం­ది. వాం­ఖ­డే వే­ది­క­గా జరి­గిన మ్యా­చు­లో టాస్ గె­లి­చిన ముం­బై బౌ­లిం­గ్ ఎం­చు­కో­గా బెం­గ­ళూ­రు బ్యా­టిం­గ్ కు ది­గిం­ది. ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 4 వి­కె­ట్ల నష్టా­ని­కి 240 పరు­గుల భారీ స్కో­ర్ చే­సిం­ది. ఫిల్ సా­ల్ట్(78), వి­రా­ట్ కో­హ్లీ(50), పటి­దా­ర్(53) పరు­గు­లు చే­సా­రు. అనం­త­రం 241 పరు­గుల లక్ష్యం­తో బ్యా­టిం­గ్ కు ది­గిన ముం­బై.. ని­ర్ణీత ఓవ­ర్ల­లో 5 వి­కె­ట్ల నష్టా­ని­కి 222 పరు­గు­లు మా­త్ర­మే చే­సిం­ది. బెం­గు­ళూ­రు కట్టు­ది­ట్ట­మైన బౌ­లిం­గ్, ఫీ­ల్డిం­గ్ తో ముం­బై స్కో­ర్ నత్త­న­డ­కన సా­గిం­ది. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్(33), హా­ర్ది­క్ పాం­డ్య(40), రూ­థ­ర్ ఫర్డ్(71), రి­యా­న్(37) పరు­గు­లు చే­సా­రు. మి­గి­లిన బ్యా­ట­ర్లు పూ­ర్తి­గా వి­ఫ­లం కాగా బెం­గు­ళూ­రు 18 పరు­గుల తే­డా­తో సు­నా­యాస వి­జ­యం సా­ధిం­చిం­ది. RCB బౌ­ల­ర్స్ లో­సు­యా­శ్ శర్మ 2, క్రు­నా­ల్,జా­క­బ్ తలో వి­కె­ట్ తీ­సా­రు. ఈ సీ­జ­న్‌­లో బెం­గ­ళూ­రు­కు ఇది మూడో వి­జ­యం. .. ముం­బ­యి­కి మూడో ఓటమి. బెం­గ­ళూ­రు జట్టు ఆరం­భం నుం­చే దూ­కు­డు ప్ర­ద­ర్శిం­చిం­ది. ఓపె­న­ర్లు ఫి­ల్‌ సా­ల్ట్‌ మరి­యు వి­రా­ట్‌ కో­హ్లి జట్టు ఇన్నిం­గ్స్‌­కు బల­మైన పు­నా­ది వే­శా­రు. తొలి ఓవ­ర్ల­లో కో­హ్లి ఒక సి­క్స్‌­తో శు­భా­రం­భం చే­సి­న­ప్ప­టి­కీ, ప్ర­ధా­నం­గా సా­ల్ట్‌ దూ­కు­డు బ్యా­టిం­గ్‌­తో ముం­బ­యి బౌ­ల­ర్ల­పై ఒత్తి­డి పెం­చా­డు. బౌం­డ­రీ­లు, సి­క్స్‌­ల­తో వరు­స­గా స్కో­రు పెం­చు­తూ సా­ల్ట్‌ కే­వ­లం 25 బం­తు­ల్లో­నే అర్ధ­శ­త­కం సా­ధిం­చా­డు. ఐదో ఓవ­ర్లో సా­ల్ట్‌ ఒకే ఓవ­ర్లో మూడు సి­క్స్‌­లు, ఒక ఫో­ర్‌­తో మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా తమ­వై­పు తి­ప్పు­కు­న్నా­డు. మయాం­క్‌ మా­ర్కం­డే బౌ­లిం­గ్‌­లో కూడా అతను వరుస బౌం­డ­రీ­ల­తో వి­రు­చు­కు­ప­డు­తూ ప్రే­క్ష­కు­ల­ను అల­రిం­చా­డు. 10 ఓవ­ర్లు ము­గి­సే సరి­కి బెం­గ­ళూ­రు వి­కె­ట్‌ కో­ల్పో­కుం­డా 115 పరు­గు­లు చే­య­డం మ్యా­చ్‌­కు కీలక మలు­పు­గా మా­రిం­ది.

సా­ల్ట్‌ ఔట్‌ అయిన తర్వాత కె­ప్టె­న్‌ రజ­త్‌ పా­టీ­దా­ర్‌ క్రీ­జు­లో­కి వచ్చి మరింత వే­గం­గా ఆడా­డు. అతని బ్యా­టిం­గ్‌ ముం­బ­యి బౌ­ల­ర్ల­కు పూ­ర్తి­గా తల­నొ­ప్పి­గా మా­రిం­ది. మా­ర్కం­డే ఓవ­ర్లో మూడు సి­క్స్‌­లు, శా­ర్దూ­ల్‌ బౌ­లిం­గ్‌­లో బౌం­డ­రీ­లు బా­దు­తూ పా­టీ­దా­ర్‌ కే­వ­లం 20 బం­తు­ల్లో­నే 53 పరు­గు­లు చేసి జట్టు­కు భారీ స్కో­రు ది­శ­గా నడి­పిం­చా­డు. మరో­వై­పు కో­హ్లి కూడా అర్ధ­శ­త­కం పూ­ర్తి చేసి తన బా­ధ్య­త­ను ని­ర్వ­ర్తిం­చా­డు. చి­వ­రి ఓవ­ర్ల­లో టి­మ్‌ డే­వి­డ్‌ వే­గం­గా పరు­గు­లు సా­ధిం­చ­డం బెం­గ­ళూ­రు­కు మరింత ఊపు­ని­చ్చిం­ది. అతను 16 బం­తు­ల్లో 34 పరు­గు­లు చేసి జట్టు స్కో­రు­ను 240కి చే­ర్చ­డం­లో కీలక పా­త్ర పో­షిం­చా­డు. బెం­గ­ళూ­రు జట్టు 4 వి­కె­ట్ల నష్టా­ని­కి 240 పరు­గుల భారీ స్కో­రు నమో­దు చే­సిం­ది.

ఈ భారీ లక్ష్యా­న్ని చే­ధిం­చేం­దు­కు ముం­బ­యి జట్టు ధా­టి­గా ప్రా­రం­భిం­చిం­ది. ఓపె­న­ర్‌ రి­కె­ల్ట­న్‌ దూ­కు­డు­గా ఆడు­తూ బౌం­డ­రీ­లు, సి­క్స్‌­ల­తో స్కో­రు వే­గం­గా పెం­చా­డు. రో­హి­త్‌ శర్మ కూడా కొ­న్ని ఆక­ర్ష­ణీయ షా­ట్లు ఆడు­తూ జట్టు­కు మంచి ఆరం­భం అం­దిం­చా­డు. అయి­తే జట్టు స్కో­రు 57 వద్ద ఉం­డ­గా రో­హి­త్‌ గా­యం­తో రి­టై­ర్డ్‌ హర్ట్‌­గా వె­ళ్ల­డం ముం­బ­యి­కి పె­ద్ద దె­బ్బ­గా మా­రిం­ది. ఆ తర్వాత మ్యా­చ్‌ పూ­ర్తి­గా బెం­గ­ళూ­రు వైపు మళ్లిం­ది. సు­యా­శ్‌ శర్మ ఒకే ఓవ­ర్లో రి­కె­ల్ట­న్‌ మరి­యు తి­ల­క్‌ వర్మ­ను ఔట్‌ చే­య­డం మ్యా­చ్‌­కు కీలక మలు­పు­గా మా­రిం­ది. సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ మరి­యు హా­ర్ది­క్‌ పాం­డ్యా కొం­త­సే­పు పో­రా­డి­నా అవ­స­ర­మైన రన్‌­రే­ట్‌ పె­రు­గు­తూ ఉం­డ­టం­తో ఒత్తి­డి­ని తట్టు­కో­లే­క­పో­యా­రు. మధ్య­లో నమ­న్‌ ధీ­ర్‌ కూడా తక్కువ స్కో­రు­కే ఔట్‌ కా­వ­డం­తో ముం­బ­యి పరి­స్థి­తి మరింత క్లి­ష్టం­గా మా­రిం­ది. 16 ఓవర్లు ముగిసే సరికి ముంబయి స్కోరు 157/5గా ఉండటంతో మ్యాచ్‌ దాదాపు చేజారిపోయింది. చివరి ఓవర్లలో రూథర్‌ఫర్డ్‌ అద్భుతంగా ఆడుతూ వేగంగా పరుగులు సాధించాడు. అతను 31 బంతుల్లో 71 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించినప్పటికీ జట్టును విజయానికి తీసుకురాలేకపోయాడు. చివరకు ముంబయి 5 వికెట్ల నష్టానికి 222 పరుగుల వద్దే ఆగిపోయింది.

బౌలింగ్‌లో బెంగళూరు జట్టు సమిష్టిగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. కీలక సమయంలో వికెట్లు తీసుకుంటూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. మరోవైపు ముంబయి బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు భారంగా మారింది. ముఖ్యంగా బౌల్ట్‌, మార్కండే ఖరీదైన స్పెల్స్‌ వేశారు. బుమ్రా వికెట్లు తీసుకోలేకపోవడం కూడా జట్టుకు మైనస్‌గా మారింది.

Tags

Next Story