RCB: ఆర్సీబీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో..?

RCB: ఆర్సీబీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో..?
X
ఆర్సీబీ జట్టు అమ్మకం ప్రక్రియ మొదలుపెట్టిన డియాజియో... అంచనా విలువ రూ. 17,775 కోట్లు... బ్రాండ్ వాల్యూ 269 మిలియన్ డాలర్లు..

18 ఏళ్ల సు­దీ­ర్ఘ ని­రీ­క్ష­ణ­కు తె­ర­ప­డిం­ది. రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు (RCB) తొ­లి­సా­రి ప్ర­తి­ష్టా­త్మక ఐపీ­ఎ­ల్ ట్రో­ఫీ నె­గ్గిం­ది. దీం­తో ఒక్క­సా­రి­గా టీం బ్రాం­డ్ వా­ల్యూ అమాం­తం పె­రి­గి­పో­యిం­ది. అమె­రి­కా­కు చెం­దిన హౌ­లి­హ­న్ లొకే అనే ఇన్వె­స్ట్‌­మెం­ట్ బ్యాం­క్ తాజా లె­క్కల ప్ర­కా­రం ఆర్సీ­బీ వి­లువ ఏకం­గా 18.5 శాతం పె­రి­గిం­ది. ఏకం­గా రూ.1.6 లక్షల కో­ట్ల మా­ర్కె­ట్ వి­లు­వ­తో ప్ర­త్య­ర్థు­ల­కు షా­కి­చ్చిం­ది బెం­గ­ళూ­రు ఫ్రాం­చై­జీ. అదే సమ­యం­లో ఐపీ­ఎ­ల్ బ్రాం­డ్ వా­ల్యూ 14శాతం పె­రి­గ­డం­తో.. రూ.33,000 కో­ట్ల­కు చే­రిం­ది. కట్ చే­స్తే రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ బెం­గ­ళూ­రు.. విజయ సం­బ­రా­ల­లో తొ­క్కి­స­లాట దీం­తో పరి­స్థి­తు­లు అంత తల­కిం­దు­లు అయ్యా­యి.

ఆర్సీబీ ఫర్ సేల్

గతం­లో ఆర్సీ­బీ ప్రాం­చై­జీ ప్ర­ముఖ వ్యా­పా­రి వి­జ­య్ మా­ల్యా సొం­తం. 2016లో మా­ల్యా తీ­వ్ర ఆర్ధిక ఇబ్బం­దు­ల్లో పడి­న­ప్పు­డు డి­యా­జి­యో కం­పె­నీ మా­ల్యా మద్యం కం­పె­నీ­తో పాటు ఆర్సీ­బీ­ని కూడా కొ­ను­గో­లు చే­సిం­ది. 2008లో మా­ల్యా తి­రి­గి ఆర్సీ­బీ­ని 111.6 మి­లి­య­న్ డా­ల­ర్ల కు కొ­ను­గో­లు చే­శా­డు. 2014లో డి­యా­జి­యో యూ­ఎ­స్‌­ఎ­ల్ మె­జా­రి­టీ వా­టా­ను కొ­ను­గో­లు చే­సిం­ది. 2016 నా­టి­కి మా­ల్యా ని­ష్క్ర­మణ తర్వాత డి­యా­జి­యో ఆర్సీ­బీ­ని పూ­ర్తి­గా సొం­తం చే­సు­కుం­ది. ప్ర­స్తు­తం ఈ జట్టు­ను యూ­ఎ­స్‌­ఎ­ల్ అను­బంధ సం­స్థ రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ స్పో­ర్ట్స్ ప్రై­వే­ట్ లి­మి­టె­డ్ ని­ర్వ­హి­స్తోం­ది. ఇప్పు­డు వీరు ఆర్సీ­బీ జట్టు­ను అమ్మ­డా­ని­కి సి­ద్ధ­ప­డ్డా­రు. ఇప్ప­టి­కే దా­ని­కి సం­బం­ధిం­చిన అధి­కా­రిక ప్ర­క్రియ కూడా మొ­ద­లు పె­ట్టా­రు. ఆర్సీ­బీ చాలా పా­పు­లా­రి­టీ. ము­ఖ్యం­గా వి­రా­ట్ కో­హ్లీ ఫ్యా­న్స్ వల్ల బల­మైన సపో­ర్ట్ కూడా ఉంది. సపో­ర్ట్ కూడా ఉంది. ఇప్పు­డు ఈ టీం అమ్మ­కా­ని­కి ఉన్న­ట్లు తె­లి­య­డం­తో బెం­గ­ళూ­రు­కు చెం­దిన వ్యా­పార ది­గ్గ­జా­లు ఈ టీమ్ ను చే­జి­క్కిం­చు­కో­వా­ల­ని చూ­స్తు­న్నా­రు. రే­సు­లో ముం­దు­న్న­వా­రి­లో జె­రో­ధా కో-ఫౌం­డ­ర్ ని­ఖి­ల్ కా­మ­త్, మనీ­పా­ల్ ఎడ్యు­కే­ష­న్ అండ్ మె­డి­క­ల్ గ్రూ­ప్ చై­ర్మ­న్ రం­జ­న్ పై, సీరం ఇన్‌­స్టి­ట్యూ­ట్ సీఈఓ అదా­ర్ పూ­న­వా­లా పే­ర్లు ఎక్కు­వ­గా వి­ని­పి­స్తు­న్నా­యి. ని­ఖి­ల్ కా­మ­త్, రం­జ­న్ పై ఇద్ద­రూ కర్ణా­టక మూ­లా­లు ఉన్న­వా­రు. వీ­రి­ద్ద­రూ ప్ర­ధాన పో­టీ­దా­రు­లు. ఇక అదా­ర్ పూ­న­వా­లా సో­ష­ల్ మీ­డి­యా­లో 'స­రైన ధరకు ఆర్సీ­బీ మంచి జట్టు' అని గతం­లో చే­సిన పో­స్టు వై­ర­ల్ అయిం­ది. RCB వి­లువ 1 బి­లి­య­న్ డా­ల­ర్ల­కు పైగా ఉం­టుం­ద­ని అం­చ­నా. కా­మ­త్, పై, పూ­న­వా­లా కలి­సి కన్సా­ర్షి­యం­గా బిడ్ పె­ట్టొ­చ్చ­ని కూడా తె­లు­స్తోం­ది. ఇక వీ­రి­తో పాటు మరి­కొం­ద­రి పే­ర్లు కూడా వి­ని­పి­స్తు­న్నా­యి. JSW గ్రూ­ప్‌­కు చెం­దిన పా­ర్థ్ జిం­ద­ల్, అదా­నీ గ్రూ­ప్, RJ కా­ర్ప్‌­కు చెం­దిన రవి జై­పూ­రి­యా, అమె­రి­కా ప్రై­వే­ట్ ఈక్వి­టీ ఫం­డ్లు కూడా పో­టీ­లో ఉండే అవ­కా­శ­ముం­ది. రా­య­ల్ ఛా­లెం­జ­ర్స్ స్పో­ర్ట్స్ ప్రై­వే­ట్ లి­మి­టె­డ్ లో పె­ట్టు­బ­డి­పై సమీ­క్ష ప్రా­రం­భి­స్తు­న్న­ట్లు యూ­ఎ­స్‌­ఎ­ల్‌ లే­ఖ­లో పే­ర్కొం­ది. అమ్మ­కా­ని­కి ఆర్సీ­బీ పు­రు­షు­లు, మహి­ళల జట్లు ఉన్నా­యి. రెం­డు టీ­మ్స్ అమ్మ­కం ప్ర­క్రియ ఇప్ప­టి­కే ప్రా­రం­భం కాగా.. వచ్చే ఏడా­ది మా­ర్చి 31 నా­టి­కి పూ­ర్తి­చే­యా­ల­ని కం­పె­నీ ఆశి­స్తోం­ది. ఈ వి­ష­యం­పై యూ­ఎ­స్‌­ఎ­ల్‌ సీ­ఈ­వో, ఎండీ ప్ర­వీ­ణ్‌ సో­మే­శ్వ­ర్‌ మా­ట్లా­డా­రు. ‘యూ­ఎ­స్‌­ఎ­ల్‌­కు ఆర్‌­ఎ­స్‌­పీ­ఎ­ల్‌ వి­లు­వైన, వ్యూ­హా­త్మక ఆస్తి. జట్టు­ను డి­యా­జి­యో కం­పె­నీ సొం­తం చే­సు­కో­వ­డం పట్ల చాలా మంది వా­టా­దా­రు­లు అసం­తృ­ప్తి­గా ఉన్నా­రు’ అని తె­లి­పా­రు.

Tags

Next Story