Harshal Patel: నువ్వు ఇచ్చిన స్ఫూర్తి వల్లే ఈ రోజు ఇలా: హర్షల్ భావోద్వేగం

Harshal Patel: భారత పేసర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సూపర్ స్టార్ హర్షల్ పటేల్ గత వారం మరణించిన తన సోదరి కోసం భావోద్వేగ లేఖ రాశారు. స్టార్ పేసర్ ఇంతకుముందు బయో బబుల్‌ను విడిచిపెట్టి తన సోదరిని చివరి చూపు చూసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి జట్టులో పాల్గొన్నాడు.
సోషల్ మీడియా వేదికగా తన సోదరికి నివాళులు అర్పించాడు హర్షల్. IPL 2022లో రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టుపై బెంగళూరు విజయం సాధించిన తర్వాత, పటేల్ తన సోదరితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పటేల్ తన సోదరితో పంచుకున్న చిరస్మరణీయ క్షణాలను గుర్తుచేసుకున్నాడు.
అక్క జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నదని, అయినా ఎప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వు ఉండేదని హర్షల్ వెల్లడించాడు. "దీదీ, నువ్వు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులలో ఒకరు. నీ చివరి శ్వాస వరకు నీ ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు. నేను భారతదేశానికి తిరిగి రాకముందు ఆసుపత్రిలో నీతో ఉన్నప్పుడు నువ్వు నా ఆటపై దృష్టి పెట్టమని నీ గురించి బాధపడవద్దని చెప్పావు. ఆ మాటలే నేను గత రాత్రి తిరిగి వచ్చి గ్రౌండ్ లో ఆడడానికి కారణమయ్యాయి" అని పటేల్ రాశాడు. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో .. అది మంచి అయినా చెడు అయినా నేను నిన్ను మిస్సవుతున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తాను.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. ఐ లవ్యూ అక్క అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు హర్షల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com