Real Madrid vs AC Milan: రియల్ మాడ్రిడ్ గెలుపు

Real Madrid vs AC Milan: స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్, ఇటలీకి చెందిన ఎసీ మిలన్ జట్లు సోమవారం ఒక స్నేహపూర్వక మ్యాచ్‌లో తలపడ్డాయి. కాలిఫోర్నియాలో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది రియల్ మాడ్రిడ్ తనదైన శైలిలో ప్రీ సీజన్‌ని ఆరంభించింది.
2-0 గోల్స్‌తో వెనకబడ్డా అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. 83వ నిమిషంలో మాడ్రిడ్‌కి కావాల్సిన గోల్ కొట్టి బ్రెజిల్ ఆటగాడు విన్సియస్ జూనియర్ విజయం అందించాడు. మాడ్రిడ్ డిఫెండర్ వాల్వర్డ్ 2 గోల్స్ కొట్టి అదరగొట్టాడు.
రెండవ అర్ధభాగంలోకి 0-2 వెనకంజతో వచ్చిన మాడ్రిడ్, 53వ నిమిషంలో మిలన్ గోల్‌కీపర్ తప్పిదంతో ఫెడ్రిక్ వాల్వర్డ్ గోల్ కొట్టాడు. మరో 5 నిమిషాల తర్వాత కూడా బాక్స్ అవతల నుంచి మరో గోల్ కొట్టి స్కోర్‌ని 2-2తో సమం చేశాడు.
తర్వాత ఇరుజట్లు గెలుపు గోల్ కోసం తీవ్రంగా యత్నించినప్పటికీ సఫలం అవ్వలేదు. 83వ నిమిషంలో మాడ్రిడ్ ఫార్వర్డ్ ఆటగాడు విన్సియస్ గోల్ కొట్టి మాడ్రిడ్‌కి విజయం అందించాడు.
మొదటి అర్ధభాగం అంతా ఏసీ మిలన్‌దే హవా. ఆ జట్టు ఆటగాళ్లు దూకుడైన ఆట ఆడారు. 25 నిమిషంలో ఫికాయో తొమోరీ, లూకా రోమిరోలు 42వ నిమిషంలో గోల్స్ చేసి రియల్‌మాడ్రిడ్‌పై ఆధిక్యాన్నందించారు.
ఈ మ్యచ్ ఇరు జట్లకు తమ ప్రధాన లీగ్‌లైన లాలిగా, సిరీ-ఏ లకు సన్నాహకాలుగా ఉపయోగపడనున్నాయి. రియల్ మాడ్రిడ్ గత సీజన్‌లో బార్సిలోనాకు లాలిగా టైటిల్ కోల్పోగా, ఏసీ మిలన్ నాపోలీకి ట్రోఫీని చేజార్చుకుంది.
ప్రస్తుత సీజన్‌ని రియల్ మాడ్రిడ్ ఆగస్ట్ 12న ప్రారంభించనుండగా, ఏసీ మిలన్ జట్టు ఆగస్ట్ 21న తన తొలి మ్యాచ్ ఆడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com