నాకూ పాజిటివ్.. వైరస్‌ని తేలిగ్గా తీసుకోవద్దు.. : సానియా మిర్జా

నాకూ పాజిటివ్.. వైరస్‌ని తేలిగ్గా తీసుకోవద్దు.. : సానియా మిర్జా
వైరస్ జోక్ కాదని, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు.

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మంగళవారం తాను కూడా ఈ ఏడాది మొదట్లో కరోనా వైరస్ బారిన పడినట్లు వెల్లడించింది, అయితే ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

పాజిటివ్ పరీక్షించిన తర్వాత తన రెండేళ్ల బిడ్డకు దూరంగా ఉండటం చాలా కష్టతరమైన విషయం అని ఆమె వెల్లడించింది. వైరస్ జోక్ కాదని, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు.

"సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఏమి జరుగుతుందనే ఆందోళన నాకు కలిగింది. నేను కోవిడ్ గురించి సంకోచించాను. దేవుడి దయవల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, అయితే నా అనుభవాన్ని పంచుకోవాలనుకున్నాను. పాజిటివ్ కారణంగా నేను ఒంటరిగా ఉన్నాను.

నా 2 సంవత్సరాల వయసున్న బాబుకి, మరియు కుటుంబానికి దూరంగా ఉండటమే కష్టతరమైంది. నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో నేనూహించగలను. ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు చాలా మంది ఉండి ఉంటారనిసానియా మీర్జా ట్విట్టర్లో రాశారు.

ఒంటరిగా ఉండడం అనే చాలా భయంకరమైన విషయం. దీంతో పాటు మీరు ప్రతిరోజూ ఒక క్రొత్త లక్షణాన్ని పొందుతారు. ఇది శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నేను తగినంత జాగ్రత్తలు తీసుకున్నాను. నా స్నేహితులను, కుటుంబాన్ని రక్షించడానికి చేయగలిగినంత చేయాలి.. మీరు కచ్చింతంగా మాస్కులు ధరించండి.. చేతులు శుభ్రంగా కడుక్కోండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ప్రియమైన వారిని రక్షించండి " అని ఆమె తెలిపారు.

గత ఏడాది, సానియా మీర్జా ఆసియా / ఓషియానియా విభాగంలో దేశం యొక్క మొట్టమొదటి ఫెడ్ కప్ హార్ట్ అవార్డును 2020 లో మూడు ప్రాంతీయ గ్రూప్ I నామినీలకు వేసిన మొత్తం 16,985 ఓట్లలో 10,000 కంటే ఎక్కువ ఓట్లను సాధించింది.

ఫెడ్ కప్ హార్ట్ అవార్డు విజేతలను ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా అభిమానులు నిర్ణయించారు, ఇది మే 1 నుండి ఒక వారం పాటు కొనసాగింది. ప్రతి వర్గానికి చెందిన విజేతలకు 2,000 డాలర్ల ప్రైజ్ మనీ కూడా ఇవ్వబడింది.

Tags

Next Story