CWC 2023: విజయంపై కన్నేసిన ఆస్ట్రేలియా

ప్రపంచకప్‌లో నేడు పసికూన నెదర్లాండ్స్‌తో.. అయిదుసార్లు ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తలపడనుంది. ఢిల్లీ అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచుల్లో ఓటములతో డీలా పడ్డ ఆస్ట్రేలియా... వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ దిశగా మరో ఆడుగు ముందుకు వేయాలని చూస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్... కంగారులను కంగారు పెట్టాలని చూస్తోంది. ప్పటికే అద్భుత పోరాటంతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న డచ్ జట్టును తేలిగ్గా తీసుకుంటే కంగారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. డచ్ జట్టుతో మ్యాచ్‌లో ఎలాంటి అలసత్యం ప్రదర్శించబోమని.. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్ కీలకమని తమకు తెలుసని ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ వెల్లడించాడు. ఇప్పటికే పాకిస్థాన్ మ్యాచ్‌లో భారీ శతకంతో విధ్వంసం సృష్టించిన వార్నర్ రాణిస్తే ఆసిస్‌ను ఆపడం డచ్ జట్టుకు తలకు మించిన భారం కానుంది.
గాయం నుంచి కోలుకున్న ట్రావిస్ హెడ్.... లబుషేన్ స్థానంలో జట్టులోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఇఆస్ట్రేలియా జట్టులో టాపార్డర్ బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ విధ్వంస బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నారు. ఓపెనర్లు మెరుగ్గా రాణిస్తున్నా మిడిల్ ఆర్డర్ వైఫల్యం కంగారు జట్టును ఆందోళన పరుస్తోంది. బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తున్నారు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్ ఇప్పటివరకూ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. స్పిన్నర్ ఆడమ్ జంపా, పేసర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ స్థిరంగా రాణిస్తున్నారు.
నెదర్లాండ్స్ ఇప్పటివరకూ వన్డేల్లో ఆస్ట్రేలియాను ఎన్నడూ ఓడించలేదు. 2003, 2007లోఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయారు. కానీ డచ్ జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించి.. శ్రీలంకపై కొద్దిలో ఓడిపోయారు. వీరు ఆసిస్‌పైనా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, ర్యాన్ క్లైన్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్ విక్రమ్‌జిత్ సింగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com