Cricket: రింకూ మళ్లీ అలా.. కష్టమే: వీరేంద్ర సెహ్వాగ్

Cricket: రింకు సింగ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఐదు సిక్సర్లు కొట్టి తన జట్టును 205 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు రింకు సింగ్‌ను MS ధోని, సచిన్ టెండూల్కర్‌లతో పోల్చారు. “రింకూ సింగ్ ఉన్నాడని KKR జట్టులో నమ్మకం బలపడింది. 90వ దశకంలో, టెండూల్కర్ ఉంటే మ్యాచ్ గెలవవచ్చు, లేకపోతే కష్టం అని ఫీలయ్యేవారు జట్టు సభ్యులు. అదే ధోనీ విషయంలోనూ జరిగేది. ఇప్పుడు అదే విషయం KKR జట్టులో ఉన్న రింకూ సింగ్ విషయంలోనూ రిపీట్ అవుతోంది. అంతకు ముందు వారికి ఆండ్రీ రస్సెల్ ఉండేవాడు' అని ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పాడు.
అయితే రింకూ వరుసగా ఐదు సిక్సర్లు బాదిన ఫీట్‌ను మళ్లీ సాధించలేడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. “క్రికెట్ చరిత్రలో ఇది ఎన్నడూ జరగలేదు. రింకూ సింగ్ కూడా ఇంకెప్పుడూ ఇలా చేయలేరు. ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది, కానీ రింకూ తన జీవితంలో 6 సిక్సర్లు కొట్టి ఆ రికార్డును బద్దలు కొట్టలేడు” అని అన్నాడు. “దీనికి కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ చేస్తే రింకూ కూడా అతడిని కొట్టలేడని తెలిసేది అని వీరేంద్ర అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com