Rishabh Pant: పంత్ హెల్త్ అప్ డేట్.. డెహ్రాడూన్ నుంచి ముంబైకి

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్.. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా పంత్ ట్రీట్ మెంట్ పై ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఓ హెల్త్ అప్ డేట్ ఇచ్చింది. మెరుగైన చికిత్స కోసం పంత్ ను డెహ్రాడూన్ నుంచి ముంబైకు తరలించబోతున్నట్లు డీడీసీఏ డైరెక్ట్ శ్యామ్ శర్మ వెల్లడించాడు.
ప్రస్తుతానికి చికిత్స నిమిత్తం ముంబైకి తీసుకుత్తున్నామని, అక్కడ రిషభ్ పంత్ గాయాలకు మెరుగైన చికిత్స అందించనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. చికిత్స అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని, అంతేకాక రిషభ్ ముంబైలో బీసీసీఐ నియమించిన ప్రఖ్యాత స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ దిన్షా పార్దివాలా అబ్జర్వేషన్ లో ఉంటాడని తెలియజేశారు.
ఇక ముంబైలో చికిత్స అనంతరం వైద్యులు రిషబ్ పంత్ రిపోర్టులను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఒకవేళ సర్జరీ చేయాలని వైద్యులు చెప్తే, అతడ్ని యూఎస్ లేదా యూకేకి తీసుకువెళ్లడానికి కూడా తాము సిద్దమని బీసీసీఐ తెలిపారు. అంతేకాకుండా పూర్తి స్ధాయి చికిత్స తర్వాత పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com