PANT: ధోని ఓ హీరో: పంత్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రశంసలు కురిపించాడు. ధోని దేశానికి హీరో అని, అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండడం ముఖ్యమని ధోనీ సలహా ఇచ్చేవాడని, ఆ సలహా పాటించడం వల్లే రికార్డును అందుకోగలిగానని పంత్ తెలిపాడు. ఒకే టెస్ట్‌లో అత్యధిక క్యాచ్‌లతో పంత్ ప్రపంచ రికార్డు సమం చేసిన విషయం తెలిసిందే. భారత జట్టుకు రెండుసార్లు ప్రపంచ కప్‌ను అందించిన సారథిగా ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని పంత్ ప్రశంసలు కురిపించాడు. ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టమని.. ఆ దిశగా తాను సాగుతానని వెల్లడించాడు.
ధోని ఓ హీరో..
ధోనీ దేశానికి హీరోనని పంత్ అన్నాడు. వ్యక్తిగతంగా, క్రికెటర్‌గా అతడినుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నానని అన్నాడు. ధోనీ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందన్నాడు. వికెట్ కీపర్, ఆటగాడిగా ఓర్పు అత్యంత కీలకమని ధోనీ తనకు సలహా ఇచ్చాడని తెలిపారు. ప్రశాంతంగా ఉంటూ 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలని చెబుతుంటాడన్నాడు.
గొప్ప కెప్టెన్లలో ఒకడు
భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. T20 ప్రపంచ కప్ (2007), ODI ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) మూడు ప్రధాన ICC వైట్-బాల్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా లెజెండ్ గా ధోని నిలిచాడు. ధోని భారత్ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు ఐపిఎల్ టైటిల్‌ను సంపాదించి పెట్టాడు. 2023లో ఫ్రాంచైజీకి టైటిల్‌ని అందించిన తర్వాత ధోని CSK కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ధోనీ కీలక వ్యాఖ్యలు
తనను తాను ప్రమోట్ చేసుకోవాలని తన మేనేజర్లు తనపై ఒత్తిడి తెస్తారని, అయితే తన ఆట బాగుంటే తనకు పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) అవసరం లేదని ధోని పేర్కొన్నాడు. "నేను ఎప్పుడూ సోషల్ మీడియాకు పెద్ద అభిమానిని కాదు. అంతటా నాకు వేర్వేరు మేనేజర్లు ఉన్నారు. వారందరూ పుష్ చేస్తూనే ఉన్నారు. నేను 2004లో ఆడటం ప్రారంభించాను. ప్రచారం చేసుకోవాలని మేనేజర్లు సూచించే వారు. నేను మంచి క్రికెట్ ఆడితే, నాకు పీఆర్ అవసరం లేదనే సమాధానం కూడా నా దగ్గర ఉంది" అని యూరోగ్రిప్ ట్రెడ్ టాక్స్‌లో ధోని పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com