పంత్‌కు వైరస్ సోకింది అక్కడ కాదంట..అసలు కారణం ఇదే..?

Rishabh Pant
Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులో ఇద్దరు ప్లేయర్స్ కొవిడ్ బారిన పడ్డారు. వారిలో యువ వికెట్‌కీపర్‌కు రిషభ్ పంత్‌కు కరోనా వైరస్ సోకింది. అయితే పంత్ యూరో ఛాంపియన్‌షిప్ మ్యాచులకు వెళ్ళి.. అక్కడ మాస్క్ లేకుండా అభిమానులతో ఫోటోలు దిగడమే కరోనా సోకడానికి కారణం అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త భయటకువచ్చింది.
అసలు రిషభ్ పంత్‌కు కరోనా రావడానికి మరొక కారణం ఉందని తెలుస్తోంది. పంత్ డెంటిస్ట్ కలవడం వల్లే అతను కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. డెల్టా వేరియెంట్ ఎలా? సోకిందో చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు ఎవరిదగ్గరా లేవు. అయితే జులై 5, 6 తేదీల్లో అతడు డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు కూడా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని జట్టు వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు. నిజానికి పంత్ జూన్ 29న వెంబ్లీ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. జులై 8న పాజిటివ్ వచ్చింది. ఈ విషయం 15వ తేదీన బయటకు వచ్చింది. అయితే జులై 7వ తేదీ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొవిడ్ టెస్టులో పాజిటివ్ రావడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com