IPL: రాజస్థాన్ కెప్టెన్ గా రియాన్ పరాగ్

IPL: రాజస్థాన్ కెప్టెన్ గా రియాన్ పరాగ్
X
తొలి మూడు మ్యాచులకు సారధిగా పరాగ్... కోహ్లీ తర్వతా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సారధిగా రియాన్ ప‌రాగ్ నియమితులయ్యాడు. ఐపీఎల్‌లో తొలి మూడు మ్యాచ్‌ల‌కు అత‌నే సార‌ధిగా కొన‌సాగుతాడని ఆర్ఆర్ యాజమాన్యం వెల్లడించింది. రెగ్యుల‌ర్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌.. ఆ మ్యాచుల్లో స్పెష‌లిస్టు బ్యాట‌ర్ క‌మ్ ఇంపాక్ట్ స‌బ్‌స్టిట్యూట్‌గా ఆడ‌నున్నాడు. ఇటీవ‌ల శాంస‌న్ చేతి వేలికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. సంజు పూర్తి స్థాయి కీప‌ర్‌గా బ‌రిలోకి దిగేందుకు ఇంకా క్లియ‌రెన్స్ రాలేదు. శాంస‌న్ వేళ్ల‌కు మ‌రింత రెస్టు కావాల‌ని ఎక్స‌లెన్స్ సెంట‌ర్ అభిప్రాయ‌ప‌డింది. దీంతో 23 ఏళ్ల రియాన్ ప‌రాగ్‌కు .. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. కోహ్లీ త‌ర్వాత ఐపీఎల్‌లో అతి పిన్న వ‌య‌సులో కెప్టెన్సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్లేయ‌ర్‌గా రియాన్ ప‌రాగ్ నిల‌వ‌నున్నాడు.

ఐపీఎల్లో అత్యంత విలువైన జట్టు ఇదే

ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ఆరంభం కానుండడంతో క్రికెట్ ప్రపంచమంతా ఈ మెగా లీగ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ లీగ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఐపీఎల్ లీగ్ విలువ అక్షరాలా రూ.50 లక్షల కోట్లు. ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టుగా ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని ఏలుతున్న అంబానీ, క్రికెట్‌లో కూడా తనదైన ముద్ర వేశారు. ముంబైను అత్యంత విలువైన ఫ్రాంచైజీగా తీర్చిదిద్దారు.

టీమిండియాకు BCCI భారీ నజరానా

టీమిండియాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్లు చెప్పింది. ఇటీవల న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నందుకు BCCI అభినందనలు తెలిపింది.

Tags

Next Story