RO-KO: ఆస్ట్రేలియా అభిమానులకు రో-కో వీడ్కోలు

RO-KO: ఆస్ట్రేలియా అభిమానులకు రో-కో వీడ్కోలు
X
మళ్లీ ఆడాతామో లేదో అన్న రోహిత్ శర్మ.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ ప్రసంగం...రో-కోను చూసేందుకు పోటెత్తిన ఫ్యాన్స్

తాను, వి­రా­ట్ కో­హ్లీ మళ్లీ ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­లో ఆడు­తా­మో లేదో తె­లి­య­ద­ని టీ­మిం­డి­యా మాజీ కె­ప్టె­న్ రో­హి­త్ శర్మ అన్నా­డు. కానీ ఆస్ట్రే­లి­యా గడ్డ­పై ఆడిన ప్ర­తీ క్ష­ణా­న్ని ఆస్వా­దిం­చా­మ­ని హిట్ మ్యా­న్ చె­ప్పు­కొ­చ్చా­డు. మూడు వన్డేల సి­రీ­స్‌­లో భా­గం­గా సి­డ్నీ వే­ది­క­గా జరి­గిన ఆఖరి వన్డే­లో రో­హి­త్ శర్మ(125 బం­తు­ల్లో 13 ఫో­ర్లు, 3 సి­క్స్‌­ల­తో 121 నా­టౌ­ట్) అజేయ సెం­చ­రీ­తో చె­ల­రే­గ­గా.. వి­రా­ట్ కో­హ్లీ(81 బం­తు­ల్లో 7 ఫో­ర్ల­తో 74 నా­టౌ­ట్) అజేయ అర్థ­శ­త­కం­తో రా­ణిం­చా­డు. దాం­తో ఈ మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా 9 వి­కె­ట్ల తే­డా­తో ఆసీ­స్‌­ను చి­త్తు చే­సిం­ది.

రోహిత్ భావోద్వేగ ప్రసంగం

‘ఆస్ట్రే­లి­యా­కు రా­వ­డం నాకు చాలా ఇష్టం. ఇక్కడ క్రి­కె­ట్ ఆడటం అద్భు­తం­గా ఉం­టుం­ది. 2008లో ఇదే సి­డ్నీ మై­దా­నం­లో హా­ఫ్‌ సెం­చ­రీ చేశా. అప్పు­డు మ్యా­చ్‌­ను కూడా గె­లి­పిం­చా. దా­ని­ని ఎప్ప­టి­కీ మర్చి­పో­లే­ను. ఈరో­జు కూడా మంచి ఇన్నిం­గ్స్ ఆడా­ను. సెం­చ­రీ చే­య­డం చాలా ఆనం­దం­గా ఉంది. వి­రా­ట్ కో­హ్లీ­తో కలి­సి ఆడటం ఎప్పు­డూ ఆస్వా­ది­స్తా. ఈరో­జు కూడా ఎం­జా­య్ చేశా. మొ­ద­టి వి­కె­ట్ పడ్డాక వి­రా­ట్ వచ్చా­డు. వి­కె­ట్ ఇవ్వ­కుం­డా రన్స్ చే­యా­ల­ను­కు­న్నాం. మ్యా­చ్ వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చాం’ అని రో­హి­త్ శర్మ చె­ప్పా­డు. ‘నేను, వి­రా­ట్ కో­హ్లీ మరలా ఆస్ట్రే­లి­యా­కు వస్తా­మో లేదో నాకు తె­లి­య­దు. ఇన్నే­ళ్లు­గా ఆస్ట్రే­లి­యా­లో ఆడటం సర­దా­గా ఉంది. ఆస్ట్రే­లి­యా­లో నాకు మధుర జ్ఞా­ప­కా­లు ఉన్నా­యి. అలా­నే చెడు జ్ఞా­ప­కా­లు కూడా ఉన్నా­యి. ఆసీ­స్ గడ్డ­పై క్రి­కె­ట్ ఆడ­టా­న్ని ఎల్ల­ప్పు­డూ ఆస్వా­దిం­చా. మమ్మ­ల్ని ఆద­రిం­చిన ఆస్ట్రే­లి­యా అభి­మా­ను­ల­కు కృ­త­జ్ఞ­త­లు’ అని రో­హి­త్ శర్మ చె­ప్పు­కొ­చ్చా­డు. తా­మి­ద్ద­రం ఆస్ట్రే­లి­యా­కు రా­మ­ని రో­హి­త్ హిం­ట్ ఇచ్చా­డ­ని అం­టు­న్నా­రు.

బ్యాటింగ్ అంత ఈజీ కాదు..

ఈ మ్యా­చ్‌­లో సెం­చ­రీ­తో చె­ల­రే­గిన రో­హి­త్ శర్మ­కు ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్‌ అవా­ర్డ్‌­తో పాటు ప్లే­య­ర్ ఆఫ్ ది సి­రీ­స్ అవా­ర్డ్ దక్కిం­ది. ఈ సం­ద­ర్భం­గా తన ప్ర­ద­ర్శన గు­రిం­చి మా­ట్లా­డిన రో­హి­త్.. ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­డు. 'ఆ­స్ట్రే­లి­యా కం­డి­ష­న్స్ ఎప్పు­డూ ఇలా­నే ఉం­టా­యి. ఇక్కడ రా­ణిం­చ­డం అంత సు­లు­వు కాదు. నేను సు­దీ­ర్ఘ కాలం క్రి­కె­ట్ ఆడ­లే­దు. కానీ ఈ పర్య­టన కోసం బాగా సి­ద్ద­మ­య్యా­ను. మేం ఈ సి­రీ­స్ గె­ల­వ­లే­క­పో­యాం. కానీ మాకు చాలా సా­ను­కూల అం­శా­లు ఉన్నా­యి. యువ ఆట­గా­ళ్లు చాలా వి­ష­యా­లు నే­ర్చు­కు­న్నా­రు.'అని రో­హి­త్ శర్మ తె­లి­పా­డు.

నెహ్రా ఏం అన్నాడంటే?

రో­హి­త్, కో­హ్లీ వయసు వారి భవి­ష్య­త్తు­ను ని­ర్ణ­యిం­చే ప్ర­మా­ణం కా­కూ­డ­ద­న్నా­డు నె­హ్రా. రో­హి­త్ వయసు 36, కో­హ్లీ 35. ఈ ఇద్ద­రు యు­వ­కు­లు కా­న­ప్ప­టి­కీ.. టీ20లో ఆడ­డా­ని­కి, వయ­సు­కు లిం­క్‌ పె­ట్ట­కూ­డ­ద­న్నా­డు నె­హ్రా. 'వ­య­స్సు అనే­ది ప్ర­మా­ణం కాదు. మీరు ఎన్ని పరు­గు­లు చే­స్తు­న్నా­ర­న్న­ది ము­ఖ్యం. యశ­స్వి జై­స్వా­ల్, రు­తు­రా­జ్ గై­క్వా­డ్ , శు­భ­మా­న్ గిల్ గు­రిం­చి మా­ట్లా­డాం ... కానీ రో­హి­త్ శర్మ ఆడా­ల­ను­కుం­టే, వా­రం­తా అత­ని­తో పోటీ పడా­లి. అతను 36- ఏళ్ళ వయ­సు­న్న సూ­ప­ర్ యు­వ­కు­డు. మనం వి­రా­ట్ కో­హ్లి లేదా రో­హి­త్ శర్మ గు­రిం­చి మా­ట్లా­డే­ట­ప్పు­డు ఈ వి­ష­యా­లు గు­ర్తు­పె­ట్టు­కో­వా­లి' అని కా­మెం­ట్ చే­శా­డు.

Tags

Next Story