IPL: అసలు ధోనీ సమస్యే కాదు

IPL: అసలు ధోనీ సమస్యే కాదు
X
ప్రస్తుతం చెన్నై జట్టు మార్పు దశలో ఉందన్న ఊతప్ప

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌పై చివరి వరకూ పోరాడినా ఫలితం సానుకూలంగా రాలేదు. గత మ్యాచ్‌ వరకూ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఎంఎస్ ధోనీ ఈసారి మాత్రం ఐదో స్థానంలోనే క్రీజ్‌లోకి వచ్చాడు. 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ ముందు వరకు ధోనీ జట్టుకు భారంగా మారాడనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ధోనీ సమస్యే కాదని.. ప్రస్తుతం జట్టు మార్పు దశలో ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.

ధోనీని చూసేందుకే..

ధోనీ ఆటతీరులో దూకుడు లేదనే వ్యాఖ్యలు సరికాదని రాబిన్ ఊతప్ప అన్నాడు. ఐపీఎల్‌లోనే కాకుండా బయట కూడా తన బాధ్యతలను వేరొకరికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడుని గుర్తు చేశాడు. రాబోయే కాలంలో సీఎస్కే నుంచి ఏమి ఆశిస్తున్నారనేది ధోనీకి తెలుసని ఊతప్ప వెల్లడించాడు. ధోనీని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు వస్తున్నారని... ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నాడు. తప్పకుండా ఈ సమస్యకు ముగింపు దక్కుతుందని ఆశిస్తున్నానని వెల్లడించాడు. చెన్నై జట్టుకు తానొక సమస్యగా ధోనీ ఎప్పటికీ మారడని అన్నాడు.

పరిస్థితికి తగ్గట్లుగా ఆడుతా: విరాట్ కోహ్లీ

ఆధునిక యుగంలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. జట్టు తనకు ఇచ్చిన పాత్ర మేరకు, మ్యాచ్ పరిస్థితికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఇతరుల ఆటను ప్రభావితం చేయాలని తాను అస్సలు చూడనని చెప్పాడు. అయితే, ఐపీఎల్‌ ఆడటం ప్రారంభించిన మొదట్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌లో టాప్‌ఆర్డర్‌లో చోటు సంపాదించడం కోసం నిలకడగా పరుగులు చేశానని గుర్తు చేసుకున్నారు.

మ్యాక్స్‌వెల్‌కు జరిమానా

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచులో పంజాబ్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. ఆర్టికల్ 2.2 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్ కండక్ట్ లెవల్‌ 1 తప్పిదం కింద మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ పరికరాలను అవమానపరచడం వంటి నేరానికి ఫైన్‌గా విధించింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. గుజరాత్‌ పేసర్ ఇషాంత్‌ శర్మ కూడా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం ఇలాంటి తప్పిదానికి పాల్పడటంతో 25 శాతం జరిమానా ఎదుర్కొన్నాడు. అయితే, వీరిద్దరూ ఏ వస్తువును అగౌవరపరిచారనేది ఐపీఎల్ కమిటీ వెల్లడించలేదు.


Tags

Next Story