Roger Fededer: పిల్లాడి చేతిలో ఫెదెరర్ పరాజయం

Roger Fededer: పిల్లాడి చేతిలో ఫెదెరర్ పరాజయం
X
టానీతో చెస్‌ ఆడుతున్నపుడు 20-గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత అయిన రోజర్ ఆందోళనకు గురైనట్లు వెల్లడించాడు.

రోజర్ ఫెదెరర్ ఓడిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదెరర్(Roger) ఓ కుర్రాడితో సడెన్‌గా చెస్ ఆట ఆడి ఆశ్యర్యపరిచాడు. అతను ఆడింది ఫేమస్ చెస్ కిడ్ అంబాసిడర్ టానీటొల్వాతో(Tani). ఆడిన మూడు గేముల్లోనూ రోజర్ ఫెదెరరన్‌ని ఓడించాడు.

మీటింగ్ ది మాస్టర్స్(Meeting The Masters) అనే తన వీడియో షూటింగ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తనకు ఇష్టమైన నగరాల్ని చుట్టి వస్తున్నాడు. అందులో భాగంగా న్యూయార్క్ సిటీ నగరంలో వీడియోల్ని చిత్రీకరిస్తున్నాడు. అందులో భాగంగా తీసిన ఈ వీడియో అందరి దృష్టి ఎక్కువగా ఆకర్షిస్తోంది.

24 హవర్స్ విత్ రోజర్(24 Hours With Roger) అనే సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు టోక్యో, ఇతర నగరాల్లో పర్యటించిన వీడియోలు ఉన్నాయి.

Roger with Tani Video

"చిన్నపుడు ఆటలు ఆడుతున్నపటి నుంచి నేను ఎప్పుడూ ఆందోళనకు గురవ్వలేదు. నేనింత వరకు చెస్ మాస్టర్‌తో కూర్చోలేదు. ఇప్పుడు కొంచెం నెర్వస్‌గా ఉంది" అని అన్నాడు. నాకు మాత్రం ఎటువంటి బాధా లేదన్నాడు టానీ.

ఫెదెరర్‌ ఆటకి 1300-1500 మధ్య రేటింగ్ ఇస్తానన్నాడు టానీ. నా ప్రణాళికలు అతని కంటే ముందున్నాయన్నాడు. ఫెదెరర్ చాలా వినయపూర్వకమైన వ్యక్తన్నాడు. నా గురించి చదివాడు. నన్ను అభిమానిస్తున్నానన్నాడు.


"కెరీర్‌లో దేనికీ కాంప్రమైజ్ కావొద్దు. ప్రతి రోజూ నేర్చుకుంటూ ముందుకువెళ్లాలి" అని టానీకి సలహా ఇచ్చాడు.

మై నేమ్ ఈజ్ టానీ(My Name is Tani) అనే తన జీవిత చరిత్ర ద్వారా టానీ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. 2017లో నైజీరియాలో తీవ్రవాద సంస్థల హింసను తప్పించుకుని అమెరికాకు వచ్చారు. న్యూయార్క్ నగరంలో పాఠశాలలో చెస్ ఆటని ప్రారంభించిన టానీ చాలా వేగంగా ఆటను నేర్చుకుని ట్రోఫీలు గెలుస్తూ వచ్చాడు. 11 యేళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

Tags

Next Story