ROHAN BOPPANNA: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌కు చేరడం ద్వారా 43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న రోహన్ బోపన్న... ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ చేరడం ద్వారా వచ్చే వారం నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోవడం ఖాయమైంది. 43 ఏళ్ల వయసులో టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను సాధించాడు. అత్యంత వృద్ధ వయసులో ఆ ర్యాంక్‌ను చేరిన టెన్నిస్ ప్లేయర్‌గా రోహన్ బొప్పన్న నిలువనున్నాడు. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో అతను ఆ ఘనతను అందుకోనున్నాడు.
రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాధ్యూ ఎబ్డెన్ జోడి....టెన్నిస్ డబుల్స్ విభాగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా.... బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో...... అర్జెంటీనా జోడీ గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెనీపై వరుస సెట్ల విజయం సాధించి... బోపన్న జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో బోపన్న 43 ఏళ్ల వయస్సులో బోపన్న ప్రపంచ నెంబర్ వన్‌గా నిలవనున్నాడు. 20 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్ టెన్నీస్‌లో అరంగేట్రం చేసిన ఈ భారత టెన్నీస్ స్టార్... తన కెరీర్‌లో ఇప్పటివరకూ500కుపైగా విజయాలు సాధించాడు. బోపన్న డబుల్స్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు.
ఇప్పటివరకూ 17సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్న బోపన్న తొలిసారి సెమీఫైనల్ చేరి రికార్డు సృష్టించాడు. ఇవాళ జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్ట్స్ డబుల్స్‌లో. బొప్పన్న జోడి విజయం సాధించింది. క్వార్టర్స్‌లో మాథ్యూ ఎబ్దిన్‌తో కలిసి అతను హోరెత్తించాడు. బొప్పన్న జోడి 6-4, 7-6 స్కోరుతో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రూ మోల్టెనిపై గెలుపొందారు. ఓపెన్ ఎరా టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ప్రవేశించిన ఓల్డెస్ట్ ప్లేయర్‌గా గత ఏడాది బొప్పన్న ఓ రికార్డును క్రియేట్ చేశాడు. 2023 యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో ఆడిన అతను ఆ ఘనతను నమోదు చేశాడు.
20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బొప్పన్న ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడవ ర్యాంక్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. వచ్చే వారం రిలీజ్ చేసే ర్యాంకింగ్స్‌లో అతను ఫస్ట్ ప్లేస్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. బొప్పన్న భాగస్వామి మాథ్యూ ఎబ్డిన్ రెండవ ర్యాంక్‌లో నిలిచే ఛాన్సు ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com