ROHIT: టెస్టు రిటైర్మెంట్ మా నాన్నకు నచ్చలేదు: రోహిత్

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్ నిర్ణయం తన తండ్రి గురునాథ్ శర్మకు నచ్చలేదన్నారు. టెస్టు ఫార్మాట్‌ను ఎంతో ఇష్టపడే ఆయన రోహిత్ టెస్టుల నుంచి తప్పుకున్నప్పుడు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రి టెస్టు క్రికెట్‌కు బిగ్ ఫ్యాన్ అని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్ శర్మనే వెల్లడించాడు. ‘మా నాన్న.. ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేసేవారు. మా కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనకు టెస్ట్ క్రికెట్ అంటేనే ఇష్టం. నేను వన్డేలో 264 పరుగులు చేసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు మా నాన్న నుంచి నాకు పెద్దగా ప్రశంసలు రాలేదు. కానీ నేను టెస్ట్ క్రికెట్‌లో 30, 40, 50, 60 పరుగులు చేసినప్పుడు కూడా ఆయన ఆ రన్స్ గురించి నాతో వివరంగా మాట్లాడేవారు. టెస్ట్ క్రికెట్‌పై ఆయనకున్న ప్రేమే ఇందుకు నిదర్శనం. అందుకే నేను సుదీర్ఘ ఫార్మాట్‌కు రైటైర్మెంట్ ప్రకటిస్తే మొదట ఆయనకు నచ్చలేదు. కానీ తర్వాత ఆయన కూడా నా నిర్ణయాన్ని అంగీకరించారు’ అని రోహిత్ శర్మ వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com