ROHIT: కెప్టెన్సీ మార్పుపై స్పందించిన రోహిత్

టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ తొలిసారి స్పందించాడు. కెప్టెన్సీ మార్పుపై నేరుగా మాట్లాడకపోయినా.. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. జట్టు విజయం కోసం కృషి చేస్తానని, ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. సియట్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ.. తన కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా భారత జట్టుకు తాను ఎంతో చేశానని, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి అనేక మార్పులు తీసుకొచ్చానని తెలిపాడు. తాము తీసుకొచ్చిన విధానాల వల్లే టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిందన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆడటం తనకు చాలా ఇష్టమని, అక్కడి పరిస్థితులు సవాల్‌తో కూడుకున్నవని తెలిపాడు. 'నాకు అవకాశం దొరికినప్పుడల్లా మూడు ఫార్మాట్లలో రాణించేందుకు ప్రయత్నించాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నాలానే ఇతర ఆటగాళ్లు కూడా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు సేవలు అందించారు. అది జట్టుపై సానుకూల ప్రభావం చూపింది.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్లు చెదిరే రీతిలో బరువు తగ్గాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే బరువు తగ్గడంపై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. సుమారు 20 కేజీల బరువు తగ్గాడు. దాంతో బొద్దుగా కనిపించే రోహిత్ శర్మ.. కరెంట్ తీగలా సన్నగా మారిపోయాడు. ఫిట్నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు. రోహిత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
జడేజా కెరీర్ బెస్ట్ ర్యాంక్
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా సత్తా చాటాడు. బ్యాటర్‌గా కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 104* పరుగులతో రాణించిన జడేజా.. 644 రేటింగ్ పాయింట్లతో 25వ స్థానానికి ఎగబాకాడు. గతంలో బ్యాటర్‌గా జడేజా సాధించిన బెస్ట్ ర్యాంక్ 29 మాత్రమే. ఇటు, ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో బంగ్లా ఆటగాడు మెహిదీ హసన్ ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com