పెళ్లికి ముందు ఆ సినిమా చూసి ఏడ్చేవాడ్ని.. సీక్రెట్స్ బయటపెట్టిన రోహిత్

Rohit Sharma and Ritika: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. ఇక రెండో టెస్ట్‌లో రోహిత్ సత్తా చాటాడు. అర్థ సెంచరీతో దుమ్మురేపాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్ కు 126 పరుగులు భాగస్వామ్యాన్ని అందించాడు.ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్ ఎత్తిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోనే ఉన్న దినేష్ కార్తీక్ టీమిండియా ఆటగాళ్లను ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. రెండో టెస్టుకు ముందు కార్తీక్- రోహిత్ ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో రోహిత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్బంగా రితికా సజ్దేతో ప్రేమాయణం గురించి దినేశ్ కార్తీక్ ప్రశ్నించగా.. ఆమె తన వద్ద మేనేజర్‌గా పనిచేసేదని, ఆ క్రమంలో ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమే తప్పా తమకు ఆ ఆలోచనే లేదని రోహిత్ బదులిచ్చాడు. నా మిత్రులు కూడా మీరిద్దరూ క్యూట్ కపుల్‌గా ఉన్నారని, మీ ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనేవారు. నేను మాత్రం వాటిని తప్పుబట్టేవాడిని. అలాంటిదేం లేదని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని గట్టిగా చెప్పేవాడిని. కానీ కొన్నాళ్లకు వారు చెప్పిందే నిజమైంది.
'రితిక సజ్దేతో వివాహానికి ముందు రోహిత్ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసి ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నాడు, ఈ మార్పుకు కారణం ఏందని కార్తీక్ ప్రశ్నించగా రోహిత్ శర్మ నవ్వుతూ బదులిచ్చాచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే చాలా మారింది. పెళ్లి తర్వాత టౌన్‌కు షిఫ్ట్ అయ్యా కదా.. అప్‌డేట్ అయ్యాను." అంటూ రోహిత్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఇక తాను పరిస్థితులకు తగ్టట్లు నడుచుకుంటానని తెలిపాడు.
అప్పుడు వాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడిని. ఎందుకంటే వాళ్లు చాలా రోజుల ముందే ఈ విషయం చెప్పారు. అయితే అఫిషియల్‌గా మేమిద్దరం డేటింగ్ చేసిన కొన్నాళ్లకు ఎలాగోలా వాళ్లకు చెప్పేసాను. వారికి చెప్పడానికి భయం కాదు కానీ అదో విభిన్నమైన ఫీలింగ్. 20 ఏళ్ల క్రితం నాకున్న చిన్ననాటి స్నేహితులు ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నారు. వారితో కలవడం, తిరగడం చాలా ఇష్టం. నా ఆటను వాళ్లు ఇష్టపడుతారు. అతనే నిజాయితీగా నా తప్పులను కూడా చెబుతారు. ఏం షాట్ ఆడవని, నువ్వు తప్పుచేసావ్, మంచి చేసావ్ అని నా క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతారు. నేను కూడా వారితో అలానే ఉంటా. వారి వ్యక్తిగత విషయాలు నాతో పంచుకున్నప్పుడు కావాల్సిన సలహాలు కూడా ఇస్తాను. ఇప్పటికీ వాళ్లంతా నాతో టచ్‌లోనే ఉన్నారు. మా మధ్య అదే తరహా స్నేహం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com