RANJI TROPHY: పాత రోహిత్.. అలా వచ్చి వెళ్లాడు

RANJI TROPHY: పాత రోహిత్.. అలా వచ్చి వెళ్లాడు
X
రెండో ఇన్నింగ్స్ లోనూ తక్కువ పరుగులే చేసిన రోహిత్.. రాణించిన శార్దూల్

జమ్ము కశ్మీర్‌-ముంబైల మధ్య రంజీ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ కోనసాగుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచారు. యుధ్‌వీర్‌ బౌలింగ్‌లో అబిద్ అద్భుత క్యాచ్ పట్టడంతో 28 పరుగులకు ఔట్ అయిన రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమై అభిమానులను నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్.. రెండో ఇన్నింగ్స్ లో అలా వచ్చి వెళ్లాడు. అటాకింగ్ మంత్రంతో బ్యాట్‌ను ఝళిపించాడు. ఒకే ఓవర్‌లో బిగ్ సిక్స్‌తో పాటు మరో 2 బౌండరీలు బాదాడు హిట్‌మ్యాన్. 35 బంతులు ఆడిన హిట్‌మ్యాన్ 2 బౌండరీలు, 3 భారీ సిక్సుల సాయంతో28 పరుగులు చేశాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా బిగ్ షాట్స్‌తో కాసేపు పాత హిట్‌మ్యాన్ అలా వచ్చి వెళ్లాడు. ఏదేమైనా తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులతో తుస్సుమనింపించిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అభిమానులను అలరించాడు. తాజాగా రోహిత్ సిక్సర్లు కొడుతున్న వీడియోను అభిమానులు వైరల్ చేశారు. షేర్లు, కామెంట్ల, లైకులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచులో శార్దూల్ ఠాకూర్ శతకంతో చెలరేగాడు.

ఛాంపియన్స్ ట్రోఫీనే కీలకం

ఇక ఇప్పటికే రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చేసిన రోహిత్‌కి ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం తప్పనిసరైంది. ఇక్కడా విఫలమైతే తను టీమిండియాలో చోటును మర్చిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా రోహిత్ కెరీర్ ఎండింగ్‌కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో కలిపి 5 ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్ మ్యాన్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ చివరగా ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఏరి కోరి మరి తన ఓపెనింగ్ పొజిషిన్ లోకి వచ్చిన రోహిత్ కేవలం ఐదు బంతులకే ఔటయ్యాడు.

రంజీ ట్రోఫీలో జడేజా ప్రభంజనం

రంజీ ట్రోఫీలో రవీంద్ర జడేజా తన సత్తా చాటారు. బ్యాటింగ్‌లో రాణించలేకపోయినా బౌలింగ్‌లో ప్రభంజనం సృష్టించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌లో గుజరాత్ తరుపున బరిలో దిగిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశారు. దీంతో జడేజాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Tags

Next Story