క్రీడలు

Rohith Sharma : రోహిత్ శర్మ కొత్త రికార్డ్.. వన్డేల్లో 250 సిక్సులు కొట్టిన ఏకైక భారతీయ క్రికెటర్

Rohith Sharma : వన్డేల్లో 250 సిక్సులు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ.

Rohith Sharma : రోహిత్ శర్మ కొత్త రికార్డ్.. వన్డేల్లో 250 సిక్సులు కొట్టిన ఏకైక భారతీయ క్రికెటర్
X

Rohith Sharma : టీమిండియా ఓపెనర్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. మాజీలు, దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 250 సిక్సులు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ. ఈ జాబితాలో రోహిత్ తర్వాత 229 సిక్సులతో ధోనీ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. 195 సిక్సర్లతో సచిన్‌ మూడో స్థానంలోను, 190 సిక్సులు కొట్టిన గంగూలీ నాలుగో ప్లేస్‌లో ఉన్నారు.

ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 సిక్సులు బాదిన రోహిత్.. వన్డే కెరియర్‌లో 250 సిక్సర్ల హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. 351 సిక్సర్లతో పాకిస్తాన్ ప్లేయర్ ఆఫ్రిది మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్ శర్మకు భారత క్రికెట్ దిగ్గజాలు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES