Wimbledon: ఆండీ ముర్రే ఆటని వీక్షించిన ఫెదెరర్, బ్రిటన్ యువరాణి

Wimbledon: ఆండీ ముర్రే ఆటని వీక్షించిన ఫెదెరర్, బ్రిటన్ యువరాణి

లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్‌లో తొలి రౌండ్లో మాజీ నంబర్ 1, బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే విజయం సాధించాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన రియాన్‌ పెనిస్టన్‌పై 6-3, 6-0, 6-1 తేడాతో సునాయసంగా గెలుపొందాడు. పాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ స్టార్ ఆటగాడు మ్యాచ్‌ ప్రారంభంలో కొంత అసౌకర్యంగానే కనబడ్డాడు. కొన్ని షాట్ల తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చి వరుస సెట్లలో విజయం సాధించాడు. నెట్‌ షాట్లు ఆడుతూ ప్రత్యర్థికి అవకావం ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు.


అయితే మ్యాచ్‌కి ప్రత్యేక ఆకర్షణగా బ్రిటన్ యువరాణి, స్విస్ టెన్నిస్ స్టార్, 8 సార్లు వింబుల్డన్ గెలిచిన రోజర్ ఫెదెరర్ నిలిచారు. వారు బాక్స్‌లో కూర్చుని ముర్రే మ్యాచ్‌ని వీక్షించారు. ముర్రే షాట్లకు రోజర్ చప్పట్లతో అభినందిస్తూ కనిపించాడు. మ్యాచ్ అనంతరం ముర్రే మాట్లాడుతూ.. ఈ రోజు ఇక్కడ అందమైన రాజసం వచ్చి చూస్తున్నట్లుగా ఉంది. రోజర్ ఫెదెరర్, ప్రిన్సెస్‌ మ్యాచ్ వీక్షించడం ఆనందంగా ఉందన్నాడు. రోజర్ ఫెదెరర్ ఇక్కడికి వచ్చి నాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.నేను కొట్టిన పలు షాట్లకు అతని నంచి ప్రశంసలు రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నాడు. చివరి సారి 2012లో లండన్ ఒలంపిక్స్‌లో నేను ఇక్కడ ఆడుతుండగా అతను ప్రత్యర్థులకు మద్దతు ఇస్తూ కనిపించాడు. .

తొలిరౌండ్‌లో గెలిచిన ముర్రే రెండవ రౌండ్‌లో స్టెఫానోస్ లేదా డొమినిక్ థీమ్‌తో తలపడనున్నాడు. మ్యాచ్ మొదట్లో కొంత ఆందోళనగా కనబడ్డప్పటికీ తన ఫాం అందుకుని సునాయస విజయం సాధించాడు. మొదట్లో కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ, మొదటి సెట్ గెలిచాక ఆత్మవిశ్వాసం వచ్చిందని వెల్లడించాడు.


Tags

Read MoreRead Less
Next Story