SA20: ముంబై ఇండియన్స్‌దే కప్

ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్‌టౌన్ తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 టైటిల్ దక్కించుకుంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. మూడో సారి ఛాంపియన్‌గా నిలవాలన్న సన్ రైజర్స్ కల నెరవేరలేదు.
భారీ ప్రైజ్ మనీ దక్కించుకున్న MI
SA202025 లీగ్ ఛాంపియన్ గా నిలిచిన MI కేప్ టౌన్ కు భారీ ప్రైజ్ మనీ దక్కింది. MI కేప్ టౌన్ జట్టుకు రూ. 16.2 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఫైనల్‌లో ఓడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు సుమారు 7.75 కోట్ల రూపాయలు దక్కాయి. ఈ సీజన్లో మూడో, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చారు. మూడో స్థానంలో ఉన్న జట్టుకు 4.24 కోట్ల రూపాయలు అందగా, నాల్గవ స్థానంలో ఉన్న జట్టుకు 3.74 అందాయి.
తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది
యువ క్రికెటర్లకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది. యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు TPL పేరిట ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ను ఈ ఏడాది నుంచే మళ్లీ ప్రారంభిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు వెల్లడించారు. IPL ముగిసిన అనంతరం TPL నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 ఎకరాల చొప్పున కొనుగోలు చేసి కొత్త స్టేడియాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com