SACHIN: రాష్ట్రపతికి సచిన్ స్పెషల్ గిఫ్ట్

SACHIN: రాష్ట్రపతికి సచిన్ స్పెషల్ గిఫ్ట్
X
ద్రౌపది ముర్ముతో సచిన్‌ టెండూల్కర్‌ భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ భేటీ అయ్యారు. భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న సచిన్‌కు రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సచిన్.. ద్రౌపదితో మాట్లాడారు. అనంతరం తాను సంతకం చేసిన టెస్ట్ జెర్సీని ఆమెకు అందజేశారు.

విరాట్‌ను ఊరిస్తున్న సచిన్ రికార్డు

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. గత 19 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆ రికార్డ్‌ను అందుకునేందుకు విరాట్ కోహ్లీ 94 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కోహ్లీ మోకాలినొప్పి కారణంగా బరిలోకి దిగలేదు. కానీ మిగిలిన రెండు వన్డేల్లో కోహ్లీ మరో 94 పరుగులు చేస్తే .. 19 ఏళ్లుగా చెక్కుచెదరని సచిన్ రికార్డ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించనున్నాడు.

చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా

అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా పేసర్ హర్షిత్ రాణా నిలిచాడు. 23 ఏళ్ల ఈ యువకుడు గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీశాడు. జనవరి 31న ఇంగ్లండ్‌తో జరిగిన T20 అరంగేట్రంలో 3 వికెట్లు పడగొట్టాడు. నవంబర్ 2024లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు అరంగేట్రంలో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Tags

Next Story