దీప్తి కల సచిన్ నెరవేర్చేలా.. రైతు కుమార్తెకు సచిన్ సాయం

Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మంచి మనసు చాటుకున్నారు. ఓ పేద రైతు కుమార్తె కలను నిజం చేశారు. ఆమె డాక్టర్ కలను నెరవేర్చడానికి ముందుకొచ్చారు. ఆ అమ్మాయి చదువుకయ్యే ఖర్చులను మొత్తం భరించనున్నాడు.మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా జైరే ప్రాంతానికి చెందిన రైతు కుమార్తె దీప్తి విశ్వాస్ రావు జైరే చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది. ఆ దిశగా అడుగులు వేస్తూ కష్టపడి చదివింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. అయితే.. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది.
ఆమె కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న సేవా సహ్యోగ్ అనే స్వచ్ఛంద సంస్థ.. ఈ విషయాన్ని సచిన్ తెండూల్కర్ ఫౌండేషన్ 'ఎస్‌ఆర్‌టీ 10' దృష్టికి తీసుకెళ్లింది. ఫౌండేషన్ వెంటనే స్పందించింది. ఆ విద్యార్థి డాక్టర్ పట్టా సాధించే వరకు అయ్యే ఖర్చులను భరించనున్నట్లు ప్రకటించింది.సచిన్ అండతో దిప్తీ ఇప్పుడు నిర్భయంగా వైద్య విద్యను అభ్యసిస్తోంది. దీప్తి తన చదువు పూర్తి చేస్తే.. తన గ్రామం నుంచి డాక్టర్ అయిన తొలి వ్యక్తిగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ.. సచిన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది.
Dipti's journey is a shining example of chasing one's dreams and making them a reality.
— Sachin Tendulkar (@sachin_rt) July 27, 2021
Her story will inspire many others to work hard towards their goals.
My best wishes to Dipti for the future! https://t.co/n4BMOuP1yp
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com