Cricket: లండన్‌లో లంచ్... యువరాజ్, అజిత్ తో సచిన్

భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ లండన్‌లో వెకేషన్‌ని ఆస్వాదిస్తున్నాడు. IPL తర్వాత మైదానానికి దూరంగా ఉంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో తన అభిరుచుల్ని, అనుభవాల్ని ఎప్పటికప్పుడు అభిమానుల్తో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా లండన్‌లో ఉంటూ భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ నూతన ఛైర్మన్ అజిత్ అగార్కర్లతో తమ కుటుంబాలతో కలిసి లంచ్ చేశాడు. తమ భార్యలతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. మమ్మల్ని ఎప్పుడూ కలిపి ఉంచేవి రెండే రెండు అంశాలు. ఒకటి స్నేహం, రెండోది ఆహారం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ముగ్గురు లెజెండ్లని ఒకే ఫ్రేంలో చూసిన అభిమానులు తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.
విండీస్ మాజీ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా కూడా స్పందిస్తూ.. నాకు కేవలం హాయ్, బాయ్‌లు చెప్పే స్నేహితులు మాత్రమే ఉన్నారు. మీరు అదృష్టవంతులు. వెకేషన్‌ని ఆస్వాదించండి నా గోల్ఫ్ మిత్రులారా అంటూ తనదైన శైలిలో స్పందించాడు.
అయితే వెర్షన్‌లో ఉన్న వెటరన్ ఆటగాడు అజిత్ అగార్కర్‌ని నిన్ననే భారత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బీసీసీఐ నియమించింది. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపిలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ అజిత్ అగార్కర్‌ని ఏకగ్రీవంగా ఛైర్మన్‌గా నియమించింది.
అజిత్ అగార్కర్‌కి వచ్చే నెలలో విండీస్ పర్యటన రూపంలో మొదటి సవాల్ ఎదురవనుంది. టెస్ట్, వన్డే జట్లని ప్రకటించిన బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించలేదు. అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ పని చేయాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com