SAINA: రిటైర్‌మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సైనా నెహ్వాల్

SAINA: రిటైర్‌మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సైనా నెహ్వాల్
X
అందుకే రిటైర్మెంట్ అంటూ కామెంట్స్... నేను నిష్క్రమిస్తున్నా అంటూ ప్రకటన

బ్యాడ్మింటన్ నుంచి తన రిటైర్మెంట్‌పై స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న సైనా, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన పరిస్థితిని వెల్లడించారు. మోకాలి సమస్యతో తాను తీవ్రంగా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. శారీరకంగా ఆటకు సహకరించనప్పుడు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డారు.

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం

భారత బ్యాడ్మింటన్ దిగ్గజంగా గుర్తింపు పొందిన సైనా నెహ్వాల్, తాను ఇకపై ప్రొఫెషనల్ స్థాయిలో ఆడలేనని ఓ పాడ్‌కాస్ట్ వేదికగా స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా వెంటాడుతున్న గాయాలే ఈ నిర్ణయానికి కారణమని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా మోకాళ్ల సమస్యలు, ఆర్థరైటిస్, కార్టిలేజ్ డ్యామేజ్ వంటి శారీరక ఇబ్బందులు తన కెరీర్‌కు బ్రేక్ వేసినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితమే తాను ఆటకు దూరమయ్యానని, అప్పటి నుంచే లోపల ఈ నిర్ణయం తీసుకున్నానని సైనా భావోద్వేగంగా చెప్పారు.

“నేను నా అంతట నేనే ఆటలోకి వచ్చాను… నా అంతట నేనే నిష్క్రమిస్తున్నాను. ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదనుకున్నాను. ఏ మాత్రం ఆడగలిగే స్థితి లేనప్పుడు కథ అక్కడితో ముగిసినట్లే” అని సైనా చెప్పుకొచ్చారు. ఈ మాటల్లో ఆమె వ్యక్తిత్వం, ఆత్మగౌరవం స్పష్టంగా కనిపిస్తాయని క్రీడా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తన నిర్ణయాన్ని అభిమానులు క్రమంగా అర్థం చేసుకుంటారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తన శరీరం ఇక తనకు సహకరించడం లేదని సైనా స్పష్టంగా వివరించారు. “తేలికపాటి శిక్షణకే మోకాళ్లు వాపు వస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు 8 నుంచి 9 గంటలు శిక్షణ తీసుకున్న నేను, ఇప్పుడు గంట లేదా రెండు గంటల్లోనే తీవ్రమైన నొప్పి ఎదుర్కొంటున్నాను. అప్పుడు అర్థమైంది… ఇక ఈ ఆటను ముందుకు నెట్టలేనని” అని ఆమె చెప్పారు. ఈ స్థితిని తల్లిదండ్రులకు, కోచ్‌లకు చెప్పాల్సి రావడం తనకు చాలా కష్టంగా అనిపించిందని కూడా ఆమె పేర్కొన్నారు.

భారత మహి­ళల క్రీ­డా రం­గం­లో ఒక వి­ప్ల­వం­లా కని­పి­స్తుం­ది. చి­న్న వయ­సు­లో­నే అం­త­ర్జా­తీయ వే­ది­క­ల­పై మె­రు­పు­లు మె­రి­పిం­చిన సైనా, భారత బ్యా­డ్మిం­ట­న్‌­ను ప్ర­పంచ పటం­పై ని­ల­బె­ట్టిన తొలి మహి­ళ­గా గు­ర్తిం­పు పొం­దా­రు. ఆమె సా­ధిం­చిన వి­జ­యా­లు లక్ష­లా­ది అమ్మా­యి­ల­కు స్ఫూ­ర్తి­గా ని­లి­చా­యి. 2012 లం­డ­న్ ఒలిం­పి­క్స్‌­లో కాం­స్య పతకం సా­ధిం­చ­డం భారత క్రీ­డా చరి­త్ర­లో సు­వ­ర్ణ ఘట్టం­గా ని­లి­చిం­ది. సైనా విజయాల పరంపర కొనసాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థాయికి చేరి, భారత బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించారు. అయితే, ఈ అద్భుతమైన ప్రయాణానికి 2016 రియో ఒలింపిక్స్‌లో ఎదురైన మోకాలి గాయం పెద్ద దెబ్బగా మారింది. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు.

Tags

Next Story