SAINA: కలిసిపోయిన సైనా-కశ్యప్..!

బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట నెల క్రితం విడిపోయింది. భర్త పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోతున్నట్లు జులై 13న ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సైనా ప్రకటించారు. అయితే నెల కూడా కాకముందే సైనా అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. దూరం దగ్గర చేసింది అని క్యాప్షన్ ఇచ్చారు. తాము మరలా కలిసిపోతామని సైనా చెప్పకనే చెప్పారు. కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘కొన్నిసార్లు దూరం సన్నిహితుల విలువను మనకు నేర్పుతుంది. కలిసి ఉండేందుకు మేము మరలా ప్రయత్నం చేస్తున్నాం’ అని సైనా రాసుకొచ్చారు. పోస్టుకు రెండు హార్ట్ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘భోలేనాథ్ మీతో ఉన్నాడు, చాలా సంతోషం’, ‘హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ’, ‘మీరు మరలా కలవాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట 2018 లో ఒక్కటయ్యారు. వీరిద్దరూ హైదరాబాద్ లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు. అక్కడ ఇద్దరూ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. అప్పుడే వీరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరూ అనేక టోర్నీలు ఆడారు. అలా 2018లో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త పారుపల్లి కశ్యప్ తో తాను విడిపోతున్నట్లు జులై 13న ఇన్ స్టా స్టోరీ ద్వారా సైనా నెహ్వాల్ ప్రకటించారు. చివరిసారిగా 2023 జూన్ లో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో సైనా ఆడారు. మరోవైపు కశ్యప్ కాంపిటీటివ్ బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో సైనా గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com