SAINA: ఏడేళ్ల వివాహ బంధానికి సైనా-కశ్యప్ గుడ్ బై

మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కశ్యప్, తాను విడాకులు తీసుకుంటున్నామని సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు. బ్యాడ్మింటన్ కోర్టులో వీరిద్దరి ప్రేమ కథ ప్రారంభమైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. అకాడమీలో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. అది ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కింది. తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు సైనా, కశ్యప్ షాకిచ్చారు.
పదేళ్లకుపైగా ప్రేమించుకున్న జంట
సైనా, కశ్యప్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి పెరిగారు. సైనా ఒలింపిక్ కాంస్యం, వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ళకు పైగా ప్రేమించుకున్న తర్వాత ఈ జంట 2018లో పెళ్లి చేసుకుంది. పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచింగ్‌లోకి మారాడు. సైనా కెరీర్ చివరి సంవత్సరాలలో ఆమెకు కోచ్‌గా వ్యవహరించాడు. 2019 నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధును ఓడించినప్పుడు కశ్యప్ ఆమెకు కోచ్‌గా ఉన్నాడు. 2016 తర్వాత సైనా ఎదుర్కొన్న గాయాల నుంచి కోలుకోవడానికి కశ్యప్ ఆమెకు సహాయం చేశాడు. మైదానంలో, టోర్నమెంట్లలో కశ్యప్ సైనాకు వ్యూహాత్మక సలహాలు, సపోర్ట్ ఇస్తూ కనిపించేవాడు. సైనా చివరగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడింది. ఈ దిగ్గజ షట్లర్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. కశ్యప్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా స్పందించలేదు. కాగా, కశ్యప్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. సైనా చేసిన ఈ ప్రకటన ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. అకాడమీలో శిక్షణ సమయంలో మొదలైన సైనా-కశ్యప్ స్నేహం తర్వాత ప్రేమగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com