Sania Mirza : చివరి గ్రాండ్ స్లామ్ లో....

ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మిర్జా - రోహన్ బోపన్న జోడీకి ఓటమి ఎదురైంది. దీంతో రన్నరప్ గా నిలిచింది. చివరి గ్రాండ్ స్లామ్ లో విజయం సాధించి రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న సానియా మిర్జాకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్, భారత కాలమానం ప్రకారం శుక్రవారం జనవరి 27న జరిగింది. లూసియా స్టెఫాని - రఫేల్ మటోస్ చేతిలో సానియా - బోపన్న జోడి, 6-7, 2-6 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం జర్నీ గురించి కన్నీళ్లు పెట్టుకుంది సానియా. తన కొడుకు చూస్తుండగా గ్రాండ్ స్లమ్ ఆడతానని ఎప్పుడూ ఉహించలేదని తెలిపింది. "నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్ బోర్న్ లో మొదలైంది. నా గ్రాండ్ స్లామ్ కెరీర్ ను ముగించడానికి ఇది మంచి వేదిక. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్ స్లామ్ మ్యాచ్ ఆడతానని నేను కలలో కూడా అనుకోలేదు" అని కన్నీళ్లు పెట్టుకుంది. 36 ఏళ్ల సానియా మిర్జా తన కేరిర్ లో 43 బడుల్స్, ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com