Sanju Samson: సంజూ శాంసన్ చెత్త రికార్డు, సెంచ‌రీ హీరో ఇప్పుడు జీరో

Sanju Samson: సంజూ శాంసన్ చెత్త రికార్డు, సెంచ‌రీ హీరో ఇప్పుడు జీరో
X
దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో ఔట్‌తో కలుపుకొని ఈ ఏడాది నాలుగు సార్లు డకౌట్

వరుసగా రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ అనేక రికార్డులు సాధించాడు. భారత్ vs సౌతాఫ్రికా రెండో మ్యాచ్ లో కూడా అత‌నిపై భారీ అంచ‌నాలు ఉండేవి. అయితే,. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అత‌ను ఖాతా తెరవలేకపోయాడు. గ‌త మ్యాచ్ సెంచ‌రీ హీరో సంజూ శాంస‌న్ జీరో ప‌రుగుల‌కే పెవిలియ‌న్ కు చేరాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సెంచరీ సాధించి టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సఫారీలతో టీ20 సిరీస్‌కు ముందు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌‌పై శతకం బాదడంతో ఈ రికార్డు అతడి సొంతమైంది. అయితే నిన్న రాత్రి (ఆదివారం) దక్షిణాఫ్రికాపై రెండవ టీ20లో కూడా సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర లిఖిస్తాడేమో అని ఆశిస్తే తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యన్‌సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దీంతో సంజూ శాంసన్ ఖాతాలో ఒక అవాంఛిత రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. దక్షిణాఫ్రికాపై రెండవ టీ20లో డకౌట్‌తో కలుపుకొని ఈ ఏడాది మొత్తం 4 సార్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా సంజూ మించిపోయాడు. వీరిద్దరి కంటే ఎక్కువసార్లు డకౌట్లు అయ్యాడు. కాగా గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టీ20లో మొదటి ఓవర్‌లో సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. మార్కో యన్‌సెన్ వేసిన ఓవర్‌ మూడవ బంతికి స్టంప్స్ వదిలేసి ఆడాడు. లెంగ్త్ బాల్ దూసుకెళ్లి వికెట్లకు తగిలింది. అతను ఔట్ అయిన వెంటనే.. కామెంట‌రీ చేస్తున్న షాన్ పొలాక్, 'హీరో టు జీరో' అని చెప్ప‌డం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. శాంసన్ బోల్డ్ అయిన వీడియో దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో శాంసన్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. అయితే రెండో మ్యాచ్‌లో కూడా అతని ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంటుంద‌ని భావించిన అభిమానుల‌కు నిరాశ ఎదురైంది.

Tags

Next Story