Sanju Samson: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌కు బీసీసీఐ జ‌రిమానా

Sanju Samson: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్‌కు బీసీసీఐ జ‌రిమానా
ఇంతకీ ఏమైందంటే?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌ కు జ‌రిమానా విధించారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్ స‌మ‌యంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ల‌తో వాగ్వాదానికి దిగిన శాంస‌న్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ వేశారు. డీప్ మిడ్‌వికెట్‌లో షాయ్ హోప్ త‌న క్యాచ్ అందుకున్న వివాదంలో సంజూ అంపైర్ల‌ను నిల‌దీశారు. థార్డ్ అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని డీసీకి ఫేవ‌ర్‌గా ఇవ్వ‌డం ప‌ట్ల సంజూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ్యాచ్ అఫీషియ‌ల్స్‌తో మాట‌ల యుద్ధానికి దిగాడు. అయితే ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన సంజూకు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ విధిస్తున్న‌ట్లు బీసీసీఐ ఒక ప్ర‌ట‌క‌న‌లో తెలిపింది. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలోని ఆర్టిక‌ల్ 2.8 కింద లెవ‌ల్ వ‌న్ నేరానికి శాంస‌న్ పాల్ప‌డిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మ్యాచ్ రిఫ‌రీ నిర్ణ‌య‌మే శిరోధార్య‌మ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఈ మ్యాచ్‌లో శాంస‌న్ 86 ర‌న్స్ చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు.

మరోవైపు సంజూ శాంసన్‌ అవుట్‌పై రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ కోపంతో ఊగిపోయారు. సంజూ శాంసన్‌ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సమయంలో స్టాండ్స్‌లో ఉన్న పార్త్ జిందాల్ సహనం కోల్పోయారు. అది అవుట్, అవుట్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిందాల్‌పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌ అత్యంత చికాకు కలిగించే ఫ్రాంచైజీ యజమాని పార్త్ జిందాల్ అని ట్వీట్స్ చేస్తున్నారు.

మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ ఆ ఔట్‌పై కామెంట్ చేశారు. క్యాచ్ అందుకునే స‌మ‌యంలో బౌండ‌రీ రోప్‌ను ఫీల్డ‌ర్ రెండు సార్లు ట‌చ్ చేసిన‌ట్లు సిద్దూ తెలిపాడు. సైడ్ యాంగిల్‌లో చూస్తే బౌండ‌రీ రోప్‌ను షూ ట‌చ్ చేసిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. టెక్నాల‌జీతో సంబంధం లేకుండా ఆ విష‌యాన్ని చెప్పేయ‌వ‌చ్చు అని తెలిపారు. కీల‌క‌మైన ఆ మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఓట‌మి పాలైంది. రాజ‌స్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ జ‌ట్టు ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్న‌ది.

Tags

Read MoreRead Less
Next Story