SHAMI: షమీపై సన్ రైజర్స్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పేసర్ మహమ్మద్ షమీపై SRH కోచ్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి IPLలో అంతగా రాణించలేకపోయాడు.. కానీ షమీ పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. షమీ చాలా ఉన్నత స్థాయి ఆటగాడని, అగ్రశ్రేణి పేసరైన షమీ వచ్చే సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. అయితే షమీ ఈ సీజన్ లో 9 మ్యాచులు ఆడి.. కేవలం 6 వికెట్లే పడగొట్టాడు. అందరూ ఊహించిన విధంగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ప్రకటించిన టీమిండియా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ శనివారం ఇంగ్లాండ్ పర్యటన కోసం 18 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టులు ఆడుతుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ కొత్త సైకిల్ ఇదే సిరీస్‌తో మొదలవనున్నది. షమీ చివరిసారిగా దాదాపు రెండేళ్లుగా టెస్టులు ఆడడం లేదు. చివరిసారిగా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగాడు. గాయం కారణంగా 14 నెలలు దూరమయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com