Tulika Mann: కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన తులికా మాన్.. ఆమెకు 2 ఏళ్ల వయసులో తండ్రి హత్య..

Tulika Mann: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె తులికా మాన్ 78 కిలోల జూడో వెయిట్ క్లాస్‌లో రజత పతకాన్ని సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచిది. 23 ఏళ్ల తులికా ఇంతకు ముందు జూడోలో అంతర్జాతీయ పతకం సాధించింది. తులికా తల్లి అమృతా సింగ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. 21 ఏళ్ల క్రితం తులికకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి హత్యకు గురయ్యాడు.
తులిక తండ్రి సత్బీర్ మాన్ వ్యాపారంలో తలెత్తిన గొడవల కారణంగా చంపబడ్డాడు. ఇద్దరు అమ్మాయిలలో తులిక పెద్దది. తులిక తల్లి అమృత తన కూతురికి ఎప్పుడూ అండగా ఉండేది. తులికా మాన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన సిడ్నీ ఆండ్రూస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌కు చెందిన సారా ఎడ్లింగ్టన్ చేతిలో తులికా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తులికా అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి ఎడ్లింగ్టన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సారా దూకుడు తన కంటే ఎక్కువగా ఉందని తులిక తెలిపింది. తల్లి అమృత మీడియాతో మాట్లాడుతూ.. తులిక చదువుపై దృష్టి పెట్టాలని కోరుకున్నా.. కానీ ఆమెకు జూడోపై ఆసక్తి ఉంది. దాంతో ఆమెను ఈ క్రీడలోనే ప్రోత్సహించినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com