SMITH: ఆస్ట్రేలియాకు షాక్.. స్మిత్‌కు తీవ్ర గాయం

లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయమైంది. మూడో రోజు ఆట సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ చేతి వేలికి గాయమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి బలంగా స్మిత్ చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్దానంలో కొన్‌స్టాస్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్డేట్ ఇచ్చింది. అతడి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్ దూరం కానున్నాడు.
చరిత్ర సృష్టించిన స్మిత్
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్‌లో 18 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బోర్డర్ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్‌లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com